• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మగధీర' ను గుర్తు చేసిన...

'మగధీర' ను గుర్తు చేసిన 'సైరా'

By - Tupaki Desk
Update: 2018-08-21 11:30 GMT
‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ మెగా అభిమానులకు కనువిందే చేసింది. ‘బాహుబలి’ తర్వాత అలాంటి విజయం సాధించగల సినిమాగా ఉన్న అంచనాల్ని టీజర్ అందుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎలా డీల్ చేస్తాడో అన్న సందేహాలకు ఇది తెరదించింది. విజువల్స్ పరంగా ‘సైరా’కు తిరుగులేదని టీజర్ ను బట్టి అర్థమైంది. అలాగే కెరీర్లో ఎక్కువగా క్లాస్ సినిమాలే చేస్తూ వచ్చిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మన ప్రేక్షకుల అభిరుచి ఏమాత్రం తెలుస్తుంది.. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు సరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వగలడా అన్న అనుమానాల్ని కూడా టీజర్ పటాపంచలు చేసింది. విజువల్స్ కు తగ్గట్లే గూస్ బంప్స్ ఇచ్చే బీజీఎం ఇచ్చాడతను. ఈ రెండు విషయాల్లో ‘సైరా’ టీజర్ కు మంచి మార్కులు పడ్డాయి.

ఇక టీజర్లో ప్రత్యేకంగా అనిపించిన షాట్లలో చెట్ల పొదల్లోంచి గుర్రం మీద చిరు దూసుకొచ్చే షాట్ ఒకటి. టీజర్లోనే ఈ షాట్ గూస్ బంప్స్ ఇచ్చింది. ఈ షాట్ చూసిన వాళ్లకు ‘మగధీర’ సినిమాలో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రో సీన్ గుర్తుకు రాకుండా ఉండదు. నీటి లోంచి గుర్రం మీద దూసుకొచ్చి విలన్ తో పోటీకి రెడీ అవుతాడు చరణ్. ఆ సన్నివేశం ప్రేక్షకుల్ని ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా తండ్రిని తనయుడు అనుకరిస్తుంటాడు. కానీ ఇక్కడ చిత్రంగా కొడుకునే తండ్రి అనుకరించడం విశేషం. మరి ‘మగధీర’లో మాదిరే ఈ సీన్ కూడా స్టాండ్ ఔట్ గా నిలిచి అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందేమో చూడాలి. టీజర్ మొత్తంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే షాట్లు చాలానే ఉన్నాయి. వీటిని అంచనాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దితే ‘సైరా’ చారిత్రక విజయాన్నందుకోవడం ఖాయం.
Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Narasimha Reddy 
  • #Syeraa 
  • Sye Raa Teaser 
  • Telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS