• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ముగ్గురు హీరోయిన్లూ...

పవన్ ముగ్గురు హీరోయిన్లూ ఓకే అయినట్లేనా?

By - Tupaki Desk
Update: 2016-11-20 07:36 GMT
స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద సమస్యగా మారిపోతోంది ఈ రోజుల్లో. చిన్న.. మీడియం రేంజి హీరోలకు ఎలాంటి హీరోయిన్ అయినా ఓకే కానీ.. స్టార్ హీరోల పక్కన అంటే ఒక స్టేచర్ ఉండాలి. గ్లామర్ ఉండాలి. నటన పరంగానూ ఓకే అనిపించాలి. అలాగే ఆ హీరోయిన్ కు బాగా క్రేజ్ కూడా ఉండాలి. అన్ని రకాలుగా ఓకే అయి.. డేట్లు కూడా కావాల్సినన్ని ఇచ్చేట్లయితేనే హీరోయిన్ ఓకే అవుతుంది. ఈ మధ్య ఈ టైపు హీరోయిన్ల కొరత టాలీవుడ్లో బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒకేసారి నలుగురు హీరోయిన్లను వెతకాల్సి వచ్చింది. అందులో ‘కాటమరాయుడు’ కథానాయికగా శ్రుతి హాసన్ ఓకే అయిపోయింది.

ఇక మిగతా రెండు సినిమాల కోసం కొన్ని నెలలుగా వెతుకులాట సాగుతోంది. త్రివిక్రమ్ సెంటిమెంటుగా ఇద్దరు హీరోయిన్లను అనుకుంటే.. నీశన్ దర్శకత్వంలో సినిమాకు ఒక హీరోయిన్ అవసరమైంది. చాలా రోజుల పాటు వెతికి వెతికి.. చివరికి ముగ్గురు హీరోయిన్లను ఫైనలైజ్ చేసేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు ఆల్రెడీ ఒక కథానాయికగా కీర్తి సురేష్ ఓకే అయిపోయింది. రెండో కథానాయికగా అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’లో నటిస్తున్న పూజా హెగ్డేను అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు నీశన్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ముందు నయనతార పేరును పరిశీలించారు. తర్వాత మనసు మార్చుకుని త్రిషను ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్రిష ఇంతకుముందు పవన్ తో ‘తీన్ మార్’ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి పవన్‌ తో నటించాల్సిన ముగ్గురు హీరోయిన్ల మీదా ఓ క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Heroines 
  • Pawan kalyan 
  • Telugu News 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS