ఫ్యాషన్ - వ్యాపారం - జూదం: హీరో వైరల్ ట్వీట్
కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలై సైలెంట్ అయింది. షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోవడంతో.. విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. ఇంతకు ముందంటే.. ప్రేక్షకులు రోజుల తరబడి సినిమాలు థియేటర్లలో చూసేవారు. కానీ ఇప్పుడు వందల రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఒకటి, రెండు వారాలకే వాటి ఖేల్ ఖతం అయిపోతుంది. ఎంత వసూల్ చేసినా ఈ కొన్ని రోజులలోనే లాభాలు రాబట్టడం కోసం తెగ తంటాలు పడి ఎక్కువ థియేటర్లలో సినిమాలను విడదుల చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో థియేటర్లు తెరచుకోవడానికి మరికొన్ని నెలలు గడిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రజలు ఎక్కడ గుంపుగా పోగయినా సినిమా థియేటర్లలో భౌతిక దూరం పాటించడం కుదరని కష్టం.
ఇలాంటి సమయంలో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా నేరుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. తాజాగా యంగ్ హీరో రామ్ నటించిన రెడ్ మూవీ సైతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై రామ్ స్పందించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘సినిమా అనేది కొందరి ఫ్యాషన్, చాలా మందికి వ్యాపారం.. ఇక మిగిలిన వారికి జూదం.. వీళ్లు సినిమాను ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో చూస్తారు’ అంటూ ట్వీట్ చేస్తూ # ఓటీటీ #థియేట్రికల్ అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసాడు. ఓటిటి వేదికగా రామ్ సినిమా రిలీజ్ అవబోతుందేమో అనే నేపథ్యంలో రామ్ చేసిన ట్వీట్ పెద్ద చర్చలకే తెరలేపింది. మరి రామ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు వ్యతిరేకమా? లేక సపోర్ట్ చేస్తున్నాడా? అని అందరూ సందిగ్ధంలో పడ్డారు.