2025 రౌండప్ : డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే..!

ఈ డైరెక్టర్ తను తీసిన 8 సినిమాలు కూడా సక్సెస్ లు చేసుకుని తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్నాడు.;

Update: 2025-12-29 08:03 GMT

2025 సినీ రౌండప్ చూస్తే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాయి. కొన్ని సినిమాలు అంచనాలను మించి అలరించగా మరికొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకోలేదు. ఐతే ఒక డైరెక్టర్ మాత్రం ఆడియన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సెన్సేషనల్ హిట్ అందించాడు. ఈ డైరెక్టర్ తను తీసిన 8 సినిమాలు కూడా సక్సెస్ లు చేసుకుని తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు సంక్రాంతికి తన సినిమా వచ్చింది అంటే పక్కా సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు..

ఈ సంక్రాంతికి రిలీజై సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు ఆడియన్స్ బేషుగ్గా సినిమా చూసేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు.

అతను డైరెక్ట్ చేసిన ఏ హీరో అయినా అతని స్టార్ ఇమేజ్ కి ఈ డైరెక్టర్ కామెడీ టచ్ తోడై సూపర్ హిట్లు పడుతున్నాయి. వెంకటేష్ తో ఆల్రెడీ ఎఫ్2, ఎఫ్3 తీసిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ సినిమా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు లాంటి స్టార్ తో సరిలేరు నీకెవ్వరు చేసిన అనిల్ రావిపూడి, కెరీర్ మొదట్లో కళ్యాణ్ రామ్ తో పటాస్, సాయి ధరం తేజ్ తో సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు.

300 కోట్ల కలెక్షన్స్ తో..

ఇక బాలకృష్ణతో భగవంత్ కేసరి అంటూ ఒక క్రేజీ సినిమా తీసి హిట్ కొట్టారు. ఇలా తన ప్రతి సినిమాతో సక్సెస్ తన ఇంటి పేరుగా మార్చుకున్న అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తో 300 కోట్ల కలెక్షన్స్ తో డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.

స్టార్ హీరోతో వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేసి వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం కన్నా ఇలా రీజనల్ సినిమాలతో 300 కోట్లు కొట్టడం వల్ల ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుంది. అఫ్కోర్స్ పాన్ ఇండియాల సినిమాల లెక్క వేరు అది పక్కన పెడితే అనిల్ రావిపూడి చేస్తున్న సినిమాలు అవి అందుకుంటున్న సక్సెస్ లు.. ఆ సినిమాల బాక్సాఫీస్ సందడి చూసి అతన్ని డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ 2025 చేశాయి.

ఇక నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ తో వస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో సర్ ప్రైజ్ చేయనున్నారు.

Tags:    

Similar News