రామ్ చరణ్‌ని చూసి మరో స్టార్ హీరో అని కన్ఫ్యూజ్ అయిన అభిమానులు..!

టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్న రామ్ చరణ్ పేరు చెప్పగానే భారీ అభిమాన గణం గుర్తుకు వస్తుంది.;

Update: 2025-12-29 06:42 GMT

టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్న రామ్ చరణ్ పేరు చెప్పగానే భారీ అభిమాన గణం గుర్తుకు వస్తుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలను చూస్తే ఒకేలా ఉంటారన్న కామెంట్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గడ్డం లుక్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకేలా కనిపిస్తారని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు.

ఇటీవల ఇదే పోలిక మరోసారి ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ ఒక పబ్లిక్ ప్లేస్‌లో కారులో కనిపించగా, అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు ఆయనను యశ్ అని పొరపాటుగా అనుకున్నారు. వెంటనే “యశ్… యశ్…” అంటూ అరవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి అది రామ్ చరణ్ అని తెలుసుకుని నవ్వుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఇద్దరి ప్రస్తుత లుక్. ప్రస్తుతం రామ్ చరణ్ తన కొత్త సినిమా పెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన గడ్డంతో, రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు యశ్ కూడా తన కొత్త చిత్రం టాక్సిక్ కోసం దాదాపు అదే తరహా గడ్డం లుక్‌ను కొనసాగిస్తున్నారు. అందుకే వీడియోలు, ఫోటోల్లో ఇద్దరినీ గుర్తించడం కొందరికి కష్టంగా మారుతోంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రెండు సినిమాలు 2026 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. ఇది తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సరదా కామెంట్లు మొదలయ్యాయి. “పెడ్డి లేదా టాక్సిక్‌లో ఏదో ఒకటి వాయిదా వేయాలి.. లేకపోతే థియేటర్ల దగ్గర ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు” అంటూ ఫ్యాన్స్ జోకులు పేల్చుతున్నారు.

అయితే ఈ పోలికను అభిమానులు చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు. ఎవరి స్టార్‌డమ్ వారికి ప్రత్యేకమే అని చాలామంది అంటున్నారు. రామ్ చరణ్ అయినా, యశ్ అయినా..ఇద్దరూ తమ తమ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2026 మార్చిలో ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Tags:    

Similar News