కిరణ్ ఆమీర్ రావు ఖాన్..ఇదేంటి?
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆమీర్‌ఖాన్ 2021లో కిరణ్ రావుతో తన 16 ఏళ్ల బంధానికి ముగింపు పలికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.;
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆమీర్‌ఖాన్ 2021లో కిరణ్ రావుతో తన 16 ఏళ్ల బంధానికి ముగింపు పలికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా స్వాతంత్రం, కెరీర్‌లో ఎదుగుదల వంటి కారణాలతో వీరిద్దరు విడిపోయారు. భార్యా భర్తలుగా విడిపోయినా సరే అప్పటికి ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆమీర్‌ఖాన్ నటిస్తున్న సినిమాలకు కిరణ్ రావు సమర్పకురాలి, కో ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తూనే ఉంది.
16 ఏళ్ల సుధీర్ఘ బంధానికి ముగింపు పలికినా కిరణ్ రావు - ఆమీర్ ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నారని తాజాగా ఓ సంఘటన గుర్తు చేస్తే అందరిని విస్మయానికి గురి చేసతోంది. కిరణ్‌తో విడిపోయిన ఆమీర్ తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో సహజీవనం చేస్తున్నాడు. తనని వివాహం చేసుకోవాలనే ఆలోచతో ఉన్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల బాహాటంగానే ఆమీర్ ప్రకటించాడు. అయినా సరే కిరణ్ రావు..ఆమీర్‌తో టచ్‌లో ఉండటం పలువురిని, బాలీవుడ్ వర్గాలని షాక్‌కు గురి చేస్తోంది.
ఇదిలా ఉంటే కిరణ్ రావు అపెండిక్స్ కారణంగా ముంబాయిలోని సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చేరింది. ఇటీవలే ఆమెకు సర్జరీ పూర్తయి ప్రస్తుతం కోలుకుంటోంది. ఈ సందర్భంగా సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ సిబ్బందికి, తన స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫొటోలని షేర్ చేసింది. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, కొత్త ఏడాదిని ఇంట్లో జరుపుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అపెండిక్స్ ఆపరేషన్ 2026 ప్రారంంలో నా వేగాన్ని తగ్గించి ఊపిరి పీల్చుకో అని సంకేతాల్నిచ్చింది.
ఈ సందర్భంగా మోడ్రన్ వైద్యానికి నా కృతజ్ఞతలు. 12 మిల్లీ మీటర్ల అపెండిక్స్ ఎలా బయటకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నేను డాక్టర్‌ని కాదు కాబట్టి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు` అంటూ పేర్కొంది. అయితే ఈ సందర్భంగా కిరణ్ రావు తన చేతికి వేసిన ట్యాగ్ స్ట్రిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతికి వేసిన ట్యాగ్‌లో కిరణ్ రావు పేరు `కిరణ్ ఆమీర్ రావు ఖాన్` అని ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమీర్‌ఖాన్‌తో 2021లో విడిపోయిన కిరణ్ రావు ఇప్పటికీ తనని, తన పేరుని అలాగే కంటిన్యూ చేస్తుండటం కొత్త డౌట్‌లని క్రియేట్ చేస్తోంది.
ఇంటి పేరు లాగా ఆమీర్‌ఖాన్ పేరుని తన పేరుకు జత చేసుకుని కిరణ్ ఆమీర్ రావు ఖాన్ అని పెట్టుకోవడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. కిరణ్ రావు ఖాన్, లేదా కిరణ్ రావు ఆమీర్‌ఖాన్ అని పెట్టుకుంటారు కానీ ఇలా కిరణ్ ఆమీర్ రావు ఖాన్ అని పెట్టుకోవడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. ఆమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా`, సితారే జమీన్‌పర్ సినిమాలకు కిరణ్ రావు సహ నిర్మాతగా వ్యవహరించింది. ఆమీర్‌ఖాన్ నిర్మిస్తున్న `లాహోర్ 1947`కు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.