• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్‌ ముందు రెండు ఛాయిస్‌...

రామ్‌ ముందు రెండు ఛాయిస్‌ లు..!

By - Tupaki Desk
Update: 2018-11-18 13:09 GMT
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ దసరాకు ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తాజాగా రామ్‌ ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. తన తదుపరి చిత్రంతో తప్పకుండా మెప్పిస్తాను అంటూ నమ్మకంగా చెప్పాడు. రామ్‌ మూవీ విడుదలై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా రామ్‌ కొత్త హెర్‌ స్టైల్‌ తో డిఫరెంట్‌ మేకోవర్‌ తో ఉన్న ఒక ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటో కాస్త వైరల్‌ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో రామ్‌ కొత్త సినిమాకు సిద్దం అయ్యాడు - తదుపరి చిత్రంలో ఇలాగే కనిపించబోతున్నాడేమో - పూరి దర్శకత్వం వహిస్తాడేమో అంటూ రకరకాలుగా ఊహించేసుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ ఇంకా ఏ సినిమాకు కమిట్‌ కాలేదని, ఇంకా ఎవరితో మూవీకి ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌ ముందు పూరి జగన్నాధ్‌ సిద్దం చేస్తున్న కథతో పాటు - మారుతి చెప్పిన మరో కథ కూడా ఉందట. ఆ రెండు కథల్లో ఏది బెటర్‌ గా అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవాలని రామ్‌ భావిస్తున్నాడట. మొన్నటి వరకు పూరితో సినిమా చేయాలని రామ్‌ భావించాడట, కాని పూరి వరుసగా ఫ్లాప్‌ లు ఇస్తున్నాడు. తన కొడుకుకు కూడా సక్సెస్‌ ను ఇవ్వలేక పోయాడు. ఇలాంటి సమయంలో పూరితో సినిమా చేయడం అంటే సాహసమే అంటూ రామ్‌ సన్నిహితులు హెచ్చరిస్తున్నారట.

మరో వైపు మారుతి మంచి ఫామ్‌ లో ఉన్నాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫలితం తారుమారు అయినా కూడా మారుతిపై యంగ్‌ హీరోలు నమ్మకంగా ఉన్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి మారుతి రామ్‌ పై ఆసక్తి చూపుతున్నాడట. దాంతో రామ్‌ ఈ రెండు ఛాయిస్‌ లలో ఏది సెలక్ట్‌ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    
  • Hero Ram 
  • TElugu NEws 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS