కెఎ పాల్ కోసం నిఖిల్ పాట్లు

Update: 2019-04-22 07:57 GMT
అదేంటి మతప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కు కుర్రహీరో నిఖిల్ కు కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడ అసలు మ్యాటర్ వేరే ఉంది. మే 1న విడుదల కాబోతున్న నిఖిల్ కొత్త సినిమా అర్జున్ సురవరం మీద కుర్రాడు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే టీజర్ కు మంచి స్పందన రావడంతో సమ్మర్ లో గట్టి హిట్ కొట్టాలనే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాడు.

చేతిలో తక్కువ సమయం ఉండటంతో నిఖిల్ స్వయంగా ప్రమోషన్ లో దిగి సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్షంగా సినిమాకు తాను ఏం చేయగలనో అంతా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే కెఎ పాల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది .దీనికి కారణం లేకపోలేదు. అర్జున్ సురవరంలో నిఖిల్ చేస్తున్న పాత్ర టీవీ వీడియో జర్నలిస్ట్. ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోట వెళ్లి కావాల్సిన సమాచారాన్ని ఇంటర్వ్యూలను తీసుకోవడం అతని బాధ్యత.

సో థీమ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి కెఎ పాల్ తో సినిమా ప్రచారంలో భాగంగా ఓ ముఖాముఖీ చేస్తే వైరల్ పబ్లిసిటీ దక్కుతుందనే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. అయితే కెఎ పాల్ ప్రస్తుతం ఇండియాలో లేరు. అమెరికాలో ఉన్నట్టు తెలిసింది. మరి దగ్గరలో ఆయన రాగానే ఇది చేస్తారా లేక ఆలోచన దశలోనే ఆగిపోతుందా లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తన మాటలు చర్యల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న కెఎ పాల్ ను అర్జున్ సురవరం టీమ్ ఇలా వాడుకునే స్కెచ్ వేయడం తెలివైన ఎత్తుగడే
    

Tags:    

Similar News