అలా చేయకుంటే బతికి ఉండి వేస్ట్‌ అనిపించింది : మంచు మనోజ్‌

Update: 2023-04-13 19:39 GMT
టాలీవుడ్‌ లేటెస్ట్‌ న్యూ కపుల్‌ మంచు మనోజ్.. మౌనిక రెడ్డి లు తాజాగా ఒక టీవీ టాక్ షో లో పాల్గొన్నారు. వెన్నెల కిషోర్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆ టాక్ షో మనోజ్.. మౌనిక రెడ్డి ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న ఆ ఎపిసోడ్‌ ప్రోమో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రోమోలోనే పలు విషయాలను మనోజ్ మరియు మౌనిక రెడ్డిలు చెప్పుకొచ్చారు. తమ ప్రేమ కథ తో పాటు ప్రేమలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల గురించి మనోజ్ మరియు మౌనికలు ఈ టాక్ షో లో చెప్పుకొచ్చినట్లుగా ప్రోమోను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

ఇద్దరు ఎలా కలిశారు.. ఎలా ప్రేమ మొదలు అయ్యింది మొత్తం తెలియాల్సిందే అంటూ వెన్నెల కిషోర్ ప్రశ్నించిన సమయంలో మనోజ్ మరియు మౌనిక తమ ప్రేమ కథను వెల్లడించారు. ఒకానొక సమయంలో ప్రేమ కావాలా.. సినిమాలు కావాలా అంటూ పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో తన కోసం బిడ్డను పట్టుకుని ఉన్న అమ్మాయి కోసం నిలబడకుంటే బతికి ఉండి వేస్ట్‌ అనుకున్నాను. అందుకే మౌనిక కోసం నిలబడ్డాను అన్నట్లుగా మనోజ్ చెప్పుకొచ్చాడు.

మౌనిక మాట్లాడుతూ.. అమ్మ చనిపోయిన తర్వాత ఒక బర్త్‌ డే రోజు ఆకాశం వైపు చూసి నాకు ఏం కావాలో నీకు తెలుసు అన్నట్లుగా అమ్మ ను అడుగుతున్నాను. అప్పుడు మనోజ్ ఆళ్లగడ్డకు వస్తాడని నేను అనుకోలేదు అంటూ అప్పటి జ్ఞాపకాలను మనోజ్‌ మరియు మౌనిక రెడ్డిలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌ కోసం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొదటి పెళ్లి విడాకులు మరియు మౌనిక రెడ్డి తో ప్రేమలో పడటం వంటి కారణాల వల్ల గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మంచు మనోజ్‌ ఎట్టకేలకు సినిమాలతో బిజీ అవ్వబోతున్నాడు. అతి త్వరలోనే కొత్త సినిమాల తో బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News