హాట్ స్టార్ కొత్త ఫీచర్.. ఇకపై సినిమాల కోసం స్క్రోల్ చేయక్కర్లేదట!
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కంటెంట్ వెతకడం అనేది చాలా మందికి కాస్త కష్టంగా అనిపించే పని. ఆ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా జియో హాట్ స్టార్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది;
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కంటెంట్ వెతకడం అనేది చాలా మందికి కాస్త కష్టంగా అనిపించే పని. ఆ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా జియో హాట్ స్టార్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. కన్వర్జేషనల్ డిస్కవరీ అనే సరికొత్త ఫీచర్ తో యూజర్ల అనుభవాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ ఫీచర్ ను ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు దాన్ని యూజర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ కీవర్డ్ సెర్చ్ లకు బదులుగా న్యాచురల్ కన్వర్జేషన్ ద్వారా కంటెంట్ ను కనుగొనే అవకాశం కల్పించడం. అంటే, యూజర్లు ఇప్పుడు మెనూల్లో తిరుగుతూ సమయం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ మూడ్ లో ఏ కంటెంట్ కావాలో సింపుల్ గా వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా చెప్పగలరు. ఆ ఫీచర్ యూజర్ల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, వెంటనే సరైన సజెషన్స్ ఇస్తుంది.
ఆ కొత్త ఫీచర్ ను ఓపెన్ ఏఐ రూపొందించిన APIల ఆధారంగా.. చాట్ జీపీటీ బ్రాండింగ్ తో అందిస్తున్నారు జియో హాట్ స్టార్ నిర్వాహకులు. దీంతో యూజర్లు 'ఫ్యామిలీతో చూడడానికి మంచి సినిమా చెప్పు', 'కామెడీ షోలు కావాలి' లేదా 'ఈ రోజు మూడ్ కు సరిపోయే కంటెంట్ చూపించు' వంటి ప్రశ్నలు అడిగితే.. వెంటనే కన్వర్జేషనల్ డిస్కవరీ ఫీచర్ ద్వారా సజెషన్స్ వస్తాయి.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ ఫీచర్ పలు భాషలను సపోర్ట్ చేస్తుంది. యూజర్ల భాష, కల్చర్, ప్రవర్తనను అర్థం చేసుకుని సరైన కంటెంట్ ను సూచిస్తుంది. విభిన్న సంస్కృతులు ఉన్న మన దేశంలో ఇది పెద్ద బెనిఫిట్ గా మారనుంది. ఆ ఫీచర్ కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ లకే పరిమితం కాదు. లైవ్ స్పోర్ట్స్ కంటెంట్ కూ ఇది వర్తిస్తుంది.
యూజర్లు మ్యాచ్ హైలైట్స్, ఆటగాళ్ల స్టాటిస్టిక్స్, స్పెషల్ మూమెంట్స్ గురించి కూడా ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు. దీంతో స్పోర్ట్స్ అభిమానులకు మరింత ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. జియో హాట్ స్టార్.. ఆ ఫీచర్ ద్వారా స్క్రోలింగ్ ప్రాబ్లంను కాస్ట్ తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, ఎక్కువ సమయం వెతికే కంటే తక్కువ సమయంలో సరైన కంటెంట్ అందించడం ప్రధాన ఉద్దేశ్యం.
దీని ద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెరగడమే కాకుండా, ప్లాట్ ఫామ్ వినియోగం కూడా మరింత ఈజీ అవుతుంది. మరో కీలక అంశం ఏమిటంటే, కన్వర్జేషనల్ డిస్కవరీ ఫీచర్ ద్వారా జియో హాట్ స్టార్, చాట్‌జీపీటీ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతోంది. దీంతో యూజర్లు రెండు ప్లాట్ ఫార్మ్స్ మధ్య ఈజీగా కంటెంట్ ను కనుగొనే అవకాశముంది. ఇది ఓటీటీ రంగంలో కొత్త ట్రెండ్ కు నాంది పలికే అవకాశం ఉంది. సరైన విధంగా వర్క్ అయితే, యూజర్లకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఫ్యూచర్ లో ఇతర ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఆ ఫీచర్ ను తీసుకురావచ్చని చెప్పాలి.