సాయి పల్లవికి ఎన్ని కష్టాలు.. అగ్నిపరీక్ష షురూ!

సాయి పల్లవి అంటేనే మంచి నటన, అద్భుతమైన డ్యాన్స్ మన అందరికీ గుర్తుకు వస్తాయి.

Update: 2026-10-27 15:15 GMT

సాయి పల్లవి అంటేనే మంచి నటన, అద్భుతమైన డ్యాన్స్ మన అందరికీ గుర్తుకు వస్తాయి. సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ హీరోయిన్‌కు ఇప్పుడు కొంచెం కష్టకాలమే నడుస్తోంది అని చెప్పవచ్చు. ఇక ఈ కష్టకాలం నుంచి బయట పడాలంటే ప్రస్తుతం ఆమె రెండు పరీక్షలు పాస్ అవ్వాలి. ఆ రెండు పరీక్షలే ప్రస్తుతం రాబోయే రెండు సినిమాలు. ఈ రెండు సినిమాలు చాలా కీలకంగా మారాయి. ఒకే నెలలో రెండు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఆమె నటనపై అందరి దృష్టి పడింది.

సాయి పల్లవి కొన్ని రకాల పాత్రలకే బాగా సరిపోతుందనే అభిప్రాయం కొందరిలో ఉంది. అలాంటి విమర్శలకు సమాధానం చెప్పాలంటే ఆమె ఎంచుకున్న కొత్త పాత్రలు చాలా కీలకంగా మారింది ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరగడంతో..ఆమెపై కొంత నెగిటివిటీ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాలు ఆమెకు పెద్ద పరీక్షల్లో తీసుకురానున్నాయి.

ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న భారీ చిత్రం రామాయణలో ఆమె సీత పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ఆమె లుక్‌పై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దాంతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి ఎంతగా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తే విమర్శలకు గట్టి సమాధానం చెప్పినట్లవుతుంది. అదే సమయంలో ఈ పాత్రపై సినిమా విడుదలైన తర్వాత కూడా నెగిటివ్ ఒపీనియన్ కాని వచ్చిందంటే ఇక అది సాయి పల్లవి కెరీర్ ని చాలానే ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ధనుష్ నటిస్తున్న ‘ఓం’ సినిమాలో సాయి పల్లవి పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిణి నిత్యారెడ్డి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సన్నివేశాలతో పాటు కొత్త తరహా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఎక్కువగా సహజమైన, భావోద్వేగాలతో కూడిన పాత్రల్లో కనిపించిన ఆమెకు ఈ పాత్ర మరో పరీక్షగా నిలవనుంది.

ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమె ఎంత పెద్ద స్టార్ స్టేటస్ అందుకుంటుందో.. ఈ రెండిట్లో ఒక్కటి తేడా కొట్టిన ఆమెకు అంతే నష్టం కలగడం కూడా ఖాయంలా కనిపిస్తోంది. సీతగా భావోద్వేగాలను పండించడంతో పాటు పోలీస్ అధికారిణిగా పవర్‌ఫుల్‌గా కనిపించడం సాయి పల్లవికి పెద్ద సవాలే. ఈ రెండు పాత్రలతో ఆమె ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. దీంతో రాబోయే కాలం సాయి పల్లవికి అగ్నిపరక్ష తప్పేలా లేదు. ఈ అగ్ని పరీక్షలో ఆమె గెలిస్తేనే.. ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

Tags:    

Similar News