సీతారామం : మృణాల్‌కి లాస్ట్ మూమెంట్ లక్..!
తెలుగు సినిమా చరిత్రలో సీతారామం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు.
తెలుగు సినిమా చరిత్రలో సీతారామం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒక అద్భుతమైన దృశ్య కావ్యం, ప్రేమ కావ్యం అంటూ సీతారామం సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. సీతారామం వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన కారణంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' సినిమా ఛాన్స్ ను హను రాఘవపూడికి ఇవ్వడం జరిగింది. సెన్సిటివ్ దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి నుంచి సీతారామం వంటి మరో మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఫౌజీ అంతకు మించి ఉంటుందని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫౌజీ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. హిట్లర్, సుభాష్ చంద్రబోస్ లను సినిమాలో చూపించడం ద్వారా సినిమా స్థాయిని మరింతగా పెంచాడు.
హను రాఘవపూడి సినిమాలో...
హను రాఘవపూడి తన సినిమాలోని ప్రతి పాత్రకు నటీనటుల ఎంపిక చాలా బాగుంటుంది. ఆ పాత్రకు ఆ నటుడు తప్ప మరెవ్వరూ సెట్ కాకపోవచ్చు అనుకునే స్థాయిలో పర్‌ఫెక్ట్ గా ఉంటుంది. ఆయన అందాల రాక్షసి మూవీ నుంచి సీతారామం వరకు ఆయన పాత్రల ఎంపిక విషయంలో ఎప్పుడూ తప్పు జరగలేదు. సీతారామం సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందట. సినిమా కథ మొత్తం తెలుసుకునే పాత్ర అయిన అఫ్రీన్ పాత్రకు గాను మృణాల్ ఠాకూర్ ను హను రాఘవపూడి అనుకున్నాడు. ఆమెకు కథ చెప్పేందుకు వెళ్లిన సమయంలో అఫ్రీన్ కంటే సీతా మహాలక్ష్మి పాత్ర అయితేనే మృణాల్‌కి బాగుంటుందని అనుకున్నాడట. అప్పుడే మృణాల్‌లోని హావభావాలు, ఆమె ఇస్తున్న రియాక్షన్స్, ఆమె సెన్సిబిలిటీ నచ్చి అఫ్రీన్ పాత్రను కాకుండా సీతామహాలక్ష్మి పాత్రను ఆఫర్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా మృణాల్ చెప్పుకొచ్చింది.
సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాకూర్...
ఇటీవల మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీతామహాలక్ష్మి పాత్రతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని, హను రాఘవపూడి ఆ సినిమాలో నటింపజేయడం ద్వారా తన కెరీర్‌లో బెస్ట్ పాత్రను ఇచ్చాడని పేర్కొంది. అయితే మొదట తనను అఫ్రీన్ పాత్ర కోసం హను రాఘవపూడి సంప్రదించాడని కూడా చెప్పింది. స్టోరీ చెప్పే సమయంలో దర్శకుడు హను సీతామహాలక్ష్మి పాత్ర కు అయితే బాగుంటుందని భావించాడని మృణాల్ పేర్కొంది. హను రాఘవపూడి కథ చెప్పిన విధానం, ఆయన స్క్రీన్ ప్లే నడిపించిన తీరు నచ్చి సీతా మహాలక్ష్మి పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాను. ఆ కథ చెబుతున్న సమయంలోనే నేను బాగా కనెక్ట్ అయ్యాను అని, దర్శకుడు తన పాత్రను చక్కగా చూపించాడని చెప్పుకొచ్చింది. సీతారామం సినిమా వల్లే మృణాల్ ఠాకూర్ కెరీర్ టర్న్ తీసుకుని స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరింది.
అల్లు అర్జున్ రాకా సినిమాలో...
ఈ ఏడాది మృణాల్ నటించిన నాలుగు సినిమాలు ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో తెలుగు మూవీ డెకాయిట్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా కమర్షియల్ ఫలితం పక్కన పెడితే మృణాల్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయినా కూడా మృణాల్ కొత్త సినిమాకు కమిట్ కావడం లేదు. గత ఆరు ఏడు నెలల నుంచి మృణాల్ కొత్త సినిమాలకు కమిట్ కాకపోవడం పట్ల ఆమె ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో మృణాల్ నుంచి వచ్చే సినిమాలు లేవు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ రాకా సినిమాలో మృణాల్ నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి కానీ, మృణాల్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. మృణాల్ ఠాకూర్ కనుక రాకా లో ఉంటే కచ్చితంగా ఆమె ముందు ముందు భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.