మ‌రోసారి హిట్ కాంబినేష‌న్ !

చలనచిత్ర రంగంలో అప్పుడప్పుడూ కొన్ని కాంబినేషన్లు తొలి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాయి.;

Update: 2026-04-14 19:30 GMT

చలనచిత్ర రంగంలో అప్పుడప్పుడూ కొన్ని కాంబినేషన్లు తొలి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాయి. యంగ్ హీరో అహాన్ పాండే తన తొలి చిత్రం `సైయారా` తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమకావ్యంగా మ‌లిచాడు దర్శకుడు మోహిత్ సూరి. ఈ నేప‌థ్యంలో మరోసారి అహాన్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు సూరి. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కుతుందనే వార్త సినీ వర్గాల్లో స‌హా ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. మోహిత్ సూరి అంటేనే విభిన్నమైన ప్రేమకథలకు పెట్టింది పేరు.

`ఆషికీ 2`, `ఏక్ విలన్` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో యువత హృదయాలను గెలుచుకున్న ద‌ర్శ‌కుడు సూరి. `సైయారా` తో అహాన్ పాండేని పర్ఫెక్ట్ రొమాంటిక్ హీరోగా లాంచ్ చేసాడు. మొదటి సినిమాతోనే అహాన్ నటనలో ఉన్న పరిణతిని, డ్యాన్స్ , యాక్షన్ నైపుణ్యాలను మోహిత్ చక్కగా వాడుకున్నారు. తాజాగా రెండో సినిమాలో ఇద్ద‌రు అంతకు మించిన బలమైన సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. సాధారణంగా కొత్త హీరో తన మొదటి సినిమా దర్శకుడితోనే రెండవ‌ సినిమా చేయడం చాలా అరుదుగా జరుగుతుంది.

అయితే `సైయారా` షూటింగ్ సమయంలో అహాన్ - మోహిత్ మధ్య ఏర్పడిన సృజనాత్మక అవగాహన ఈ నిర్ణయానికి దారితీసిన‌ట్లు తెలుస్తోంది. అహాన్ శక్తి సామర్థ్యాలు ఏమిటో మోహిత్ సూరికి పూర్తిస్థాయిలో తెలుసు. కాబట్టి ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఆయన పాత్రను మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ కాంబో సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అహాన్ పాండేను గ్రాండ్‌గా పరిచయం చేసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ రెండో ప్రాజెక్ట్‌ను కూడా భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు స‌మాచారం.

వైఆర్ఎఫ్ వంటి అగ్ర సంస్థ ఓ యువ హీరోపై వరుసగా పెట్టుబడి పెడుతుందంటే? అహాన్ టాలెంట్‌పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మోహిత్ సూరి మేకింగ్ స్టైల్ , వైఆర్ఎఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్ అవ్వడం ఖాయం. మోహిత్ సూరి సినిమాల్లో సంగీతం ఆత్మ లాంటిది. `సైయారా`లోని పాటలు అంతే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. రాబోయే కొత్త చిత్రంలో కూడా సంగీతానికి పెద్దపీట వేయ‌నున్నారు. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో కథను న‌డిపించ‌డం మోహిత్ స్పెష‌లిస్ట్. ఒక యువ నటుడికి ఉండాల్సిన మాస్ ఇమేజ్ - క్లాస్ అప్పీల్‌ను మేళవించి అహాన్‌ను బాలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్‌గా నిలబెట్టే ప్రయత్నంలో మోహిత్ సూరి ఉన్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News