ఆర్‌ఎక్స్ హీరో విక్రమార్కగా రెడీ అయ్యాడు
ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా నటించేందుకు సిద్దంగా కార్తికేయ ఉంటున్నాడు. నటుడిగా తనను తాను సినిమా సినిమాకు నిరూపించుకుంటూ ఉన్న కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవగేంగా జరుపుతున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
ఈ సినిమా తో కార్తికేయ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బక్రీద్ సందర్బంగా ముస్లీం వేషధారణలో ఉన్న కార్తికేయ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కార్తికేయ ఎన్‌ఐఏ ఆపీసర్ గా కనిపించబోతున్నాడు. యాక్షన్ తో పాటు ఈ సినిమాలో లవ్ సన్నివేశాలు కూడా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కార్తికేయకు జోడీగా ఈ సినిమాలో హాట్ బ్యూటీ తాన్య రవిచంద్రన్ నటిస్తుంది. వీరి కాంబోలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.
కార్తికేయ గత చిత్రం చావు కబురు చల్లగా కమర్షియల్ గా ఆకట్టుకోలేక పోయినా కూడా విమర్శకుల ప్రశసలు దక్కించుకుంది. కరోనా కారణంగా ఆ సినిమా కాస్త కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా నటుడిగా మాత్రం కార్తికేయకు మంచి పేరును తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క సినిమా తప్పకుండా అన్ని విధాలుగా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కార్తికేయ తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఆయనకు వరుసగా విలన్ లుగా ఆఫర్లు వస్తున్నాయి.