అక్కడ హేమా ఆంటీయే హీరోయిన్‌

Update: 2015-07-29 06:04 GMT
    అల్లరి నరేష్‌ ఇటీవలి కాలంలో హిట్‌ లేక సతమతమయ్యాడు. ఆ కొరతను జేమ్స్‌ బాండ్‌ సినిమా తీర్చింది. రొటీన్‌ కంటెంట్‌ తో తెరకెక్కినా ఈ సినిమాలో కొన్ని జోకులు బాగానే పేలాయన్న పేరొచ్చింది. పైగా సాక్షి చౌదరి గ్లామర్‌ పెద్ద అస్సెట్‌ అయ్యింది. శ్రీధర్‌ సీపాన సంభాషణలు కలిసొచ్చాయి. కారణం ఏదైనా జేమ్స్‌ బాండ్‌ హిట్టు అన్న టాక్‌ వచ్చింది. ఇదే హుషారులో ఇప్పుడు నరేష్‌ అండ్‌ టీమ్‌ తెలుగు రాష్ట్రాల్లో జైత్ర యాత్ర పేరుతో హల్‌ చల్‌ చేస్తున్నారు. నిన్నటిరోజున ఏలూరు పరిసరాల్లో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    అక్కడ ప్రచారంలో అసలు సిసలు హీరోయిన్‌ ఎవరో తెలుసా? క్యారెక్టర్‌ నటి హేమ. ఈ ఆంటీగారే జేమ్స్‌ బాండ్‌ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. నేనే ఈ సినిమా హీరోయిన్‌ అన్న రేంజులో ఇన్వాల్వ్‌ అయిపోయంది హేమ. వాస్తవానికి ఈ టీమ్‌ తో పాటే సాక్షి చౌదరి ఉన్నా తనకంటే హేమనే ఎక్కువ మాట్లాడేసింది. స్టేజీ ఎక్కి దద్దరిల్లిపోయేలా చేసింది. మొత్తానికి ఈ భామ ఏలూరు సక్సెస్‌ మీట్‌ ని సక్సెస్‌ చేసింది. ఇంత చొరవ ఉన్న నటి కాబట్టే రెండు దశాబ్ధాలుగా తిరుగులేని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. దటీజ్‌ హేమా ఆంటీ అన్నమాట!
Tags:    

Similar News