అతనికి మ్యూజిక్ మాత్రమే కాదు.. ఫోటోగ్రఫీ కూడా తెలుసంట!

Update: 2021-06-16 11:30 GMT
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్ గా వెలుగుతున్న వారంతా మల్టీటాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు అందరూ వారి అదనపు టాలెంట్స్ సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కూడా సంగీతం కాకుండా వేరే టాలెంట్ బయటపెట్టాడు. ఇటీవలే తమన్ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ ఫోటోలు పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలు స్వయంగా తమన్ తీసినట్లు తెలిపాడు. అంటే తమన్ లో మంచి ఫోటోగ్రఫీ టాలెంట్ కూడా ఉందని తెలుస్తుంది.

స్టార్ హీరో అల్లు అర్జున్ - డైరెక్టర్ త్రివిక్రమ్ లను తమన్ కాప్చర్ చేసాడు. అదికూడా ఇండియాలో మాత్రం కాదు. ఫోటోలు చూస్తే బ్లాక్ అండ్ వైట్ లో ఇద్దరూ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఫోటోలో బ్యాక్ సైడ్ సన్ షైన్ కనిపించడం విశేషం అయితే త్రివిక్రమ్ ఫోటోలో ఈఫిల్ టవర్ కవర్ చేయడం విశేషమనే చెప్పాలి. ఈ రెండు ఫోటోలు బట్టి అలవైకుంఠపురంలో షూటింగ్ సమయంలో తీసినట్లుగా అనిపిస్తుంది. నిజమో కాదో గాని స్టిల్స్ ప్రకారం.. మోస్ట్ పాపులర్ సామజవరాగమనా సాంగ్ టైంలో తీసినట్లు సోషల్ మీడియాలో నేటిజన్లు గెస్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అలవైకుంఠపురంలో సినిమాకు తమనే సంగీతం అందించాడు.

ఆ ఆల్బమ్ ఎంత హిట్ అయిందో అందిరికి తెలిసిందే. ఆల్రెడీ తదుపరి సినిమాలు కూడా లైనప్ చేసుకున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సినిమాలన్ని ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట కూడా ఉంది. ఆ సినిమా అనంతరం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తదుపరి సినిమా చేయనున్నాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నాడు. అంటే తమన్ కు అటు త్రివిక్రమ్ తో మూడో సినిమా.. మహేష్ బాబుతో ఐదో సినిమా. మరి ఇప్పటివరకు మ్యూజికల్ గా అయితే తమన్ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. చూడాలి మరి నెక్స్ట్ ఆల్బమ్స్ ఎలా ఉండబోతున్నాయో!
Tags:    

Similar News