4 రోజుల్లోనే 190 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'MSG' ఊచకోత!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మరో లెవెల్ కి చేరింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.;

Update: 2026-01-16 07:31 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మరో లెవెల్ కి చేరింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమైంది. ముఖ్యంగా పండుగ సెలవులను ఈ సినిమా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోందని చెప్పవచ్చు.




 


సినిమా విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా, టికెట్ బుకింగ్స్ విషయంలో జోరు ఏమాత్రం తగ్గలేదు. బుక్ మై షో వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో, ఎగ్జిబిటర్లు చాలా చోట్ల అదనపు షోలను యాడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచినట్టేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లేటెస్ట్ గా నిర్మాణ సంస్థ ఈ సినిమా వసూళ్లకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 190 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంత తక్కువ సమయంలో ఈ మార్కును అందుకోవడం బాక్సాఫీస్ వద్ద చిరంజీవి స్టామినాను మరోసారి నిరూపిస్తోంది.

ఈ కలెక్షన్స్ చూస్తుంటే సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువలో ఉన్నట్లు అర్థమవుతోంది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది. పోటీలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ, మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా వైపే మొగ్గు చూపుతున్నారని, అందుకే ఇది 'సంక్రాంతి 2026 ఆడియన్స్ ఛాయిస్'గా నిలిచిందని చిత్ర బృందం పేర్కొంది.

అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ కామెడీతో మ్యాజిక్ చేయగా, చిరంజీవి వింటేజ్ లుక్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్, కామెడీ ట్రాక్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తానికి నాలుగు రోజుల్లోనే 200 కోట్లకు చేరువైన 'MSG', లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సంక్రాంతి సెలవులు ఇంకా మిగిలి ఉండటంతో, ఫైనల్ కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News