• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ' జై భీమ్'లో తెరవెనుక...

' జై భీమ్'లో తెరవెనుక హీరో ఆయనే!

By - Tupaki Desk
Update: 2021-11-04 14:30 GMT
మొదటి నుంచి కూడా సూర్య రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలను .. వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలను చేస్తూ వస్తున్నాడు. బయోపిక్ గా ఆ మధ్య ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకి, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా సూర్యకి ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. అదే విధంగా చంద్రూ అనే ఒక అడ్వకేట్ ను .. ఒక కేసు విషయంలో నిస్వార్థంతో ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సూర్య 'జై భీమ్' సినిమాను చేశాడు. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.

అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 2వ తేదీ నుంచి ఈ సినిమా స్టీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. సూర్య పోషించిన చంద్రూ పాత్రను గురించే చెప్పుకుంటున్నారు. 90 వ దశకంలో తమిళనాట జరిగిన ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ కి సంబంధించిన కథ ఇది. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి  చలించిపోయిన చంద్రూ అనే అడ్వకేట్, వాళ్ల తరఫున నిలబడి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఎన్నో అవాంతరాలను .. సవాళ్లను ఎదుర్కొని గిరిజనుల కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తాడు.

ఈ కథకు మూలపురుడు .. స్ఫూర్తి అయిన ఆ చంద్రూనే పై ఫొటోలో సూర్య పక్కన నుంచున్న వ్యక్తి. ఇప్పుడు తెరపై సూర్యకి దక్కుతున్న ప్రశంసలు .. సూర్య ద్వారా ఆయనకు చేరేవే. అయితే ఆయన ఈ ఒక్క కేసును మాత్రమే కాదు, ఎంతోమంది సామాన్యుల తరఫున నిలబడి వాళ్లకి న్యాయం జరిగేవరకూ అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర ఆయన కెరియర్లో కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన జడ్జిగా కూడా పనిచేశారు. తనకి సంబంధించినంతవరకూ 'మై లార్డ్' అనే సంభోదన పట్ల అయిష్టతను వ్యక్తం చేశారు.   

అంతేకాదు .. తాను జడ్జిగా ఉన్నప్పుడు కేసులు పెండింగులో పెట్టడానికి ఆయన ఎంతమాత్రం ఇష్టపడేవారు కాదు. సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించడానికి ఆయన ఉత్సాహాన్ని చూపేవారు. అలా జడ్జిగా తన ఆరేళ్ల పదవీ కాలంలో ఆయన 96 వేలకి పైగా కేసులను పరిష్కరించి కొత్త రికార్డును సృష్టించారు. అంతేకాదు సామాజిక అసమానతల విషయంపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పదవి విరమణకు ముందు .. ఆ తరువాత ఆస్తుల వివరాలను వెల్లడించి ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి ఆనవాలుగా నిలిచారు. అలాంటి వ్యక్తిని గురించి అందరికీ తెలిసేలా చేసిన సూర్యను ప్రశంసించనివారంటూ లేరు.   
Tags:    
  • Actor Surya 
  • Amazon Prime 
  • Jai Bhim 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS