తిత్లీ తో ట్రోలింగ్ సంగతి మర్చిపోయారు!

Update: 2018-10-16 07:53 GMT
'యాక్షన్ స్పీక్స్ లౌడర్ దేన్ వర్డ్స్' అనేది ఇంగ్లీష్ లో ఒక పాపులర్ కొటేషన్.  'మాటల కంటే పనే మీ గురించి ఎక్కువగా చెబుతుంది'.. ఇది దాని అర్థం.  నిజమే కదా మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రతి క్షణం అనడానికి.. నిజంగా రంగంలోకి దిగి సాయం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.  మరి అలానే తెలుగు హీరో నిఖిల్ తన చేతలతో తనేంటో చూపించాడు.

శ్రీకాకుళం.. విజయనగరం లోని కొన్ని ప్రాంతాలు ఈమధ్య తిత్లీ తుఫాను బారిన పడి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.  దీంతో అక్కడి వాళ్ళకు సహాయ కార్యక్రమాలకు చేపట్టేందుకు నిఖిల్ స్వయంగా నడుం బిగించాడు.  తన టీమ్ తో శ్రీకాకుళం చేరుకొని అక్కడ తిత్లీ బాధితులకు ఆహరం తో పాటుగా ఇతర నిత్యావసర వస్తువులు అదించారు.  అంతే కాకుండా అక్కడే వారందరితోపాటు నిలబడి వాళ్ళకోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ నే ఏ భేషజం లేకుండా తినడం విశేషం.  మాటలు చెప్పమంటే చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. కానీ స్వయంగా తుఫాను బాధితుల వద్దకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి సహాయం చేయడమే కాకుండా ఒక సాధారణ సామాజిక కార్యకర్తలాగా వాళ్ళతో కలిసిపోయి పని చేయడం పై సోషల్ మీడియాలో నిఖిల్ ను ప్రశంసల వర్షం కురుస్తోంది.  టాలీవుడ్ లో ఇతర హీరోలు కూడా నిఖిల్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నారు.

రీసెంట్ విజయ్ దేవరకొండ పై పరోక్షంగా ట్వీట్ చేసినందుకు అంతెత్తున ఎగిరిపడి నిఖిల్ ను ట్రోల్ చేసిన నెటిజనులు... విజయ్ అభిమానులు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత నిఖిల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
Tags:    

Similar News