సుకుమార్‌ అడిగితే చెర్రీ, బన్నీ కాదంటారా?

Update: 2019-01-26 12:49 GMT
టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ దర్శకుల జాబితాలో సుకుమార్‌ ఒకరు. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సుకుమార్‌ త్వరలో మహేష్‌ బాబుతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మరో వైపు సుకుమార్స్‌ రైటింగ్స్‌ లో సినిమాను నిర్మిస్తున్నాడు. మెగా బ్రదర్స్‌ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఒక చిత్రాన్ని సుకుమార్‌ నిర్మించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం కథలో భాగంగా ఒక కీలక పాత్ర ఉంటుంది, ఆ పాత్రను ఒక స్టార్‌ చేస్తే బాగుంటుందని సుకుమార్‌ భావిస్తున్నాడు.

మొదట ఈ పాత్రను సాయి ధరమ్‌ తేజ్‌ తో చేయించాలని భావించారు. అందుకు తేజూ కూడా ఓకే అన్నాడు. అయితే సాయి ధరమ్‌ తేజ్‌ ఈమద్య కాలంలో పెద్దగా సక్సెస్‌ లు ఏమీ దక్కించుకోలేదు. దాంతో ఈ చిత్రంలో తేజూ కనిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని సుకుమార్‌ భావిస్తున్నాడట. అందుకే అల్లు అర్జున్‌ లేదంటే రామ్‌ చరణ్‌ లలో ఒకరిని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. చరణ్‌ కు కెరీర్‌ లోనే కలెక్షన్స్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను ఇవ్వడంతో పాటు, నటుడిగా చరణ్‌ ను నిరూపించుకునేలా రంగస్థలం చిత్రాన్ని సుకుమార్‌ ఇచ్చాడు. ఆ రుణం తీర్చుకునేందుకు సుకుమార్‌ అడిగితే తప్పకుండా గెస్ట్‌ రోల్‌ లో నటించేందుకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

అల్లు అర్జున్‌ కెరీర్‌ ను టర్న్‌ చేసిన 'ఆర్య' సినిమాకు కూడా సుకుమార్‌ దర్శకత్వం వహించాడు. అందుకే సుకుమార్‌ ను బన్నీ చాలా గౌరవిస్తాడు. తన కెరీర్‌ ను నిలిపిన దర్శకుడిగా సుకుమార్‌ పై బన్నీకి ఎప్పుడు అభిమానం ఉంటుంది. అందుకే బన్నీ కూడా సుకుమార్‌ అడిగితే కాదనకుండా చేసే అవకాశం ఉంది. మరి వీరిద్దరిలో సుకుమార్‌ ఎవరిని కోరుకుంటాడో చూడాలి. వైష్ణవ్‌ తేజ్‌ మూవీలో ఇద్దరిలో ఎవరు నటించినా సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.
Tags:    

Similar News