'అక్షయ్‌ ను తీసుకుని ఇర్ఫాన్‌ ను తిరిగి పంపించు' - వైరల్ అవుతున్న ట్వీట్...!

Update: 2020-04-30 17:30 GMT
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది అభిమానులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇది మరువక ముందే మరో లెజెండరీ నటుడు రిషి కపూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ వారి వక్రబుద్దిని బయట పెడుతున్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతూ విమర్శలకు గురవుతున్నారు. ఈ మేరకు ఓ చిత్రమైన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 'అక్షయ్ కుమార్‌ను తీసుకునిపోయి చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ ని తిరిగి పంపించండని' ఓ వ్యక్తి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇర్ఫాన్ మృతి పట్ల అందరూ బాధ పడుతుండగా ఇలాంటి ట్వీట్స్ విద్వేషాలను కలిగిస్తాయి. అక్షయ్ కుమార్‌ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'మీకు అంతగా ద్వేషం కలిగేలా అక్షయ్ ఏం చేశారు..మోడికి మద్దతు చేయడం తప్పా.. ఆయన కష్టపడతారు, ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటారు.. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నారు. ఆయన తన కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఈ జనాలెందుకు ఆయన్ను అంతగా ద్వేషిస్తారని' ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ కాస్తా దర్శకుడు హరీష్ శంకర్ వద్దకు చేరడంతో ఆయన గట్టిగా కౌంటర్ వేశాడు. హరీష్ శంకర్ ఈ ట్వీట్స్‌ పై స్పందిస్తూ.. 'అక్షయ్ కుమార్‌ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని అంటున్నారు.. అది అంత సులభమా.. ఒకవేళ అదే జరిగితే అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఎంతో మంది ఆమెను తీసుకెళ్లమని అనేవారు.. మొదటగా ఆమె ఇక్కడ ఉండేది కాదు' అని కౌంటర్ ట్వీట్ వేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన నెటిజన్లు 'ఏమి ఇచ్చారు సర్ పంచ్... మీలాంటి వాళ్ళు చాలా అవసరం ఇలాంటి వక్రబుద్ధి తో ట్వీట్ పెట్టేవారికి... మానవతా విలువలు ఎక్కడికి వెళుతున్నాయో చెప్పడానికి...ఆమె చేసిన ట్వీట్ పెద్ద ఉదాహరణ' అని కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా 'ఆమె పెట్టిన ట్వీట్ కి 114 లైక్స్ 14 రీట్వీట్స్ వచ్చాయి.. అంటే వారు కూడా అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవారే.. వారిని ఆ దేవుడో కాపాడాలంటూ' కామెంట్ చేశారు.
Full ViewFull View
Tags:    

Similar News