వచ్చే సినిమా ఆడితేనే పేరొచ్చేది
ఇప్పటికే ''సుబ్రమణ్యం ఫర్ సేల్'' సినిమాకు క్రిటిక్స్ దగ్గర నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కాకపోతే ప్రేక్షకులకు మాత్రం సినిమా బాగా నచ్చేసింది. ముఖ్యంగా బి అండ్ సి సెంటర్లలో సినిమా బాగా ఆడుతోంది. ఓవర్ సీస్ లో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఇప్పుడు మన దర్శకుడు హరీశ్ శంకర్ కు తదుపరి చిత్రం ఎంతో కీలకం.
గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చిన పేరు రామయ్యా వస్తావయ్యాతో పోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు సబ్రమణ్యంతో ఆ రేంజు పేరు మాత్రం రాలేదు కాని.. సినిమా ఆడేస్తోంది. ఎందుకంటే సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎక్కువగా మెగాస్టార్ చిరు.. పవన్ కళ్యాణ్ లనే ఇమిటేట్ చేశాడు. అందువలనే ఏమో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు.
అయితే వచ్చే సినిమాలో ఇలా మెగా గ్యాంగ్ ను టార్గెట్ చేయకూడదు అనుకంటే ఔట్ సైడ్ హీరోతోనే చేయాలి. అప్పుడు ఇలా ఫ్యాన్స్ కోసం ఏమీ చేయడం కుదరదు. నిజంగా అలాంటి సినిమాలోనే మరోసారి ప్రూవ్ చేసుకోవాలి హరీశ్. అప్పుడే వర్కవుట్ అవుతుంది. ఆ సినిమా ఆడితేనే పేరొచ్చేది. ఏమంటారు హరీశ్?