• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ కోసం హరీష్...

పవర్ స్టార్ కోసం హరీష్ శంకర్ మాస్ స్క్రిప్ట్..

By - Tupaki Desk
Update: 2020-03-31 22:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ హరీష్ శంకర్ మార్క్ వేరు. మొదటి నుండి కమర్షియల్ మాస్ సినిమాలు తీయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన 'గబ్బర్ సింగ్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో హరీష్ శంకర్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ హవా ఇప్పటికి టీవీలో వస్తే కళ్లప్పగించి చూస్తారు. ఆ తర్వాత హరీష్ శంకర్ అంతటి విజయాన్ని అందుకోలేక పోయాడు. గతేడాది వరుణ్ తేజ్ తో రూపొందించిన 'గడ్డలకొండ గణేష్' సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. అయితే సినీ వర్గాల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ హరీష్ శంకర్ కి అవకాశం ఇవ్వనున్నాడట.

ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం మంచి మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లో సినిమా రాబోతుంది అంటేనే అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే మళ్లీ గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారట. అభిమానుల అంచనాలు అందుకునే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ పూర్తవ్వగానే పవన్ కళ్యాణ్ కి వినిపించాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న పీరియాడిక్ డ్రామా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడట పవర్ స్టార్. దాదాపు ఈ సంవత్సరం ఎండింగ్ లో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • pawan kalyan 
  • harish shankar 
  • mass script 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

Copyright @2026

Powered by Blink CMS