ఫాంహౌస్‌ లో ఉన్నారో - ఫామ్‌ లో ఉన్నారో ప్రజలు తేల్చేశారు

Update: 2018-12-11 10:57 GMT
తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి టీఆర్‌ ఎస్‌ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠ భరితంగా చూసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు క్లీయర్‌ గా కనిపించింది. ఇలాంటి సమయంలో టీఆర్‌ ఎస్‌ పార్టీకి అభినందనలు తెలుపుతు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు చేస్తున్నారు. తమ సినిమా అనుభవంతో పంచ్‌ డైలాగ్స్‌ ను - పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ను పోస్ట్‌ చేస్తూ టీఆర్‌ ఎస్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ కూడా ఈ విషయంపై స్పందించారు.

హరీష్‌ శంకర్‌ ట్విట్టర్‌ లో... ఫాంహౌస్‌ లో ఉన్నారో - ఫామ్‌ లో ఉన్నారో తేల్చి చెప్పిన జనం - ఇది ప్రజాస్వామ్యం పవర్‌. కేటీఆర్‌ - కేసీఆర్‌ - కవిత గార్లకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశాడు. కేసీఆర్‌ ను ఎక్కువగా ఫాం హౌస్‌ లోనే ఉంటున్నాడు అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసిన విషయం తెల్సిందే. అందుకే హరిష్‌ రావు జనాలు ఆ విషయాన్ని తేల్చారు. అంటూ తనదైన శైలిలో ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు. హరీష్‌ శంకర్‌ మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు టీఆర్‌ ఎస్‌ పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News