ఎన్టీఆర్ ఎవరన్నోడు..ఇప్పుడేమన్నాడో చూడండి

Update: 2017-02-15 13:22 GMT
ఫ్రస్టేషన్లో అన్నాడో లేక నిజంగా అలాంటి ఫీలింగ్ ఉందో తెలియదు కానీ.. ఆ మధ్య ‘ఎన్టీఆర్ అంటే ఎవరు’ అని మీడియా వాళ్లను ప్రశ్నించి నందమూరి అభిమానుల్ని బాగా హర్ట్ చేశాడు తమిళ స్టార్ డైరెక్టర్ హరి. ఎన్టీఆర్ తో మీరు సినిమా చేయబోతున్నారటగా అని మీడియా వాళ్లు పదే పదే అడిగేసరికి ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఐతే తర్వాత పొరబాటు తెలుసుకుని.. సారీ చెప్పినప్పటికీ అతడి మీద నందమూరి అభిమానుల్లో హరి మీద ఇంకా కోపం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ‘సింగం-3’ సక్సెస్ మీట్ కోసమని హైదరాబాద్ లో అడుగుపెట్టిన హరికి ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

హరి ఈసారి కేవలం సారీతో సరిపెట్టకుండా తనకు ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో చెప్పాడు. అంతే కాదు.. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని కూడా ఆశపడుతున్నట్లు చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాను తాను చూశానని.. అందులో అతడి నటన అద్భుతమని.. తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని కూడా చెప్పాడు హరి. ఎన్టీఆర్ తో ఒక పవర్ ఫుల్ సినిమా చేయాలని చూస్తున్నట్లు హరి తెలిపాడు. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులు హరి తాజా వ్యాఖ్యలతో పూర్తిగా శాంతిస్తారనడంలో సందేహం లేదు. మాస్ సినిమాలు తీయడంలో మంచి పట్టున్న హరి దర్శకత్వంలో నిజంగానే ఎన్టీఆర్ నటిస్తే ఒక బ్లాక్ బస్టర్ ఆశించవచ్చేమో. మరి ఈ కాంబో నిజంగానే వర్కవుటవుతుందేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News