వీడియో టాక్‌: నాగబాబు, పవన్.. తరువాత తనే

Update: 2016-10-09 09:20 GMT
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీస్తోంది ఎవరో కాదు.. దర్శకుడు వివి వినాయక్. అసలు ''ఖైదీ నెం 150'' సినిమా అనుకోగానే అందుకు వివి వినాయక్ తప్ప వేరెవరు డైరక్ట్ చేసే ఛాన్సే లేదని అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే ఇటువంటి సినిమాను తీయడానికి వినాయక్ ఎంత పవర్‌ ఫుల్ డైరక్టరో.. ఆయన మెగా ఫ్యామిలీకి ఎంత క్లోజో తెలుసు కాబట్టి.. ఆయనకే అది కట్టబెట్టారు.

ఈరోజు వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ విషెస్ వీడియో రిలీజ్ చేశారు 150 టీమ్. ఈ సినిమాలో పనిచేయడం వినాయక్ డ్రైవర్ నుండి.. ప్రొడక్షన్ మేనేజర్ వరకు.. అలాగే అసిస్టెంట్ డైరక్టర్ నుండి సినిమాటోగ్రాఫర్ వరకు.. ఆర్ట్ డైరక్టర్ నుండి మెగాస్టార్ వరకు.. అందరికీ వినాయక్ కారణంగా ఎంత హాయిగో ఉంటుందో చెప్పేశారు. బహుశా ఈ మధ్య కాలంలో ఒక డైరక్టర్ కు ఇలాంటి విషెస్ వీడియో ఎవ్వరూ రిలీజ్ చేసుండరు.

ఇకపోతే ఈ ట్రైలర్లో రామ్ చరణ్‌ చెప్పిన వినాయక్ మంచితనం ఒక హైలైట్ అయితే.. అలాగే మెగాస్టార్ స్వయంగా నాగబాబు అండ్ పవన్‌ కళ్యాణ్‌ తరువాత వినాయక నాకు తమ్ముడిలాంటోడు అంటూ స్ర్టయిట్ గా తన హార్టులోని మాట చెప్పేయడం ఇంకా పెద్ద విషయం. ఎనీవే.. హ్యాపీ బర్త్ డే వినాయక్. మీరు 'అదుర్శ్' అనిపించే కమర్షియల్ సినిమాల 'నాయక్'లను ఇదే విధంగా కలకాలం తీస్తుండాలని కోరుకుంటున్నాం.
Full View




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News