మా సినిమాకు టికెట్ల రేట్లు తక్కువ అని పోస్టర్ల మీద వేయడం, ప్రెస్ మీట్లలో ప్రకటనలు చేయడం.. ఇలాంటి ట్రెండ్ ఒకటి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కొవిడ్ తర్వాత అసాధారణంగా పెరిగిపోయిన టికెట్ల రేట్లతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించేస్తుండడంతో మున్ముందు పెద్ద ప్రమాదమే తలెత్తబోతోందని గ్రహించి తమ సినిమాలకు రేట్లు తగ్గించుకునే ప్రయత్నంలో పడుతున్నారు నిర్మాతలు.
కానీ కొన్ని సినిమాలకే ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో రేట్లు తగ్గుతున్నాయి. కొందరి మాటలు ఊరికే ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఇటీవలే విడుదలైన ‘పక్కా కమర్షియల్’కు రేట్లు బాగా తగ్గించేస్తున్నట్లు.. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి 112, మల్టీప్లెక్సుల్లో 175కు అటు ఇటుగా రేట్ ఉంటుందని నెల కిందటే ప్రెస్ మీట్లో ఘనంగా ప్రకటించాడు దాని నిర్మాత బన్నీ వాసు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమక్షంలో ఇలా ప్రకటించడంతో ఆ మేరకే రే్ట్లు ఉంటాయని అంతా అనుకున్నారు.
కానీ ‘పక్కా కమర్షియల్’ బుకింగ్స్ ఓపెన్ చేశాక.. ముందున్న రేట్లే కనిపించాయి. సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 200, ఏఎంబీలో అయితే 295 పెట్టి టికెట్లు అమ్మారు. ఈ మాత్రం దానికి అంత హడావుడి చేయడం ఎందుకు అని అందరూ బన్నీ వాసు మీద విమర్శలు గుప్పించారు. దీని గురించి మీడియాలో వార్తలు వచ్చినా కూడా స్పందన కరవైంది. దీంతో ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కుగా భావించారు జనాలు.
రేట్లు తగ్గించడం నిర్మాతల చేతుల్లో కూడా లేదేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ సందర్భంగా. కానీ ఈ వారాంతంలో విడుదల కానున్న ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రానికి మాత్రం నిర్మాతలు హామీ ఇవ్వకుండానే రేట్లు తగ్గించడం విశేషం. తాజాగా ఆ సినిమాకు హైదరాబాద్‌లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. సింగిల్ స్క్రీన్లలో రేటు 110 మాత్రమే పెట్టారు. మల్టీప్లెక్సుల రేటు 177గా ఉంది. ఏఎంబీలో సైతం రేట్ తగ్గించి 200కే టికెట్లు అమ్ముతున్నారు. ఇలాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు టాక్ బాగుంటే ఈ రేట్లు చాలా ప్రయోజనం చేకూరుస్తాయనడంలో సందేహం లేదు. మొత్తానికి గీతా ఆర్ట్స్ వాళ్లు అంత ఘనంగా ప్రకటించి మాట నిలబెట్టుకోకపోగా.. ముందు హామీలేమీ ఇవ్వకుండానే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు మాత్రం సైలెంటుగా రేట్లు తగ్గించడం విశేషం.