విమాన సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు!- పూజా
ఇండియాలోనే బిజీయెస్ట్ స్టార్ గా కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది పూజా హెగ్డే. ఈ బ్యూటీ టాలీవుడ్ అగ్ర నాయికగా దుమ్ము రేపుతోంది. అటు హిందీ తమిళ చిత్ర సీమల్లోనూ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అదే క్రమంలో హైదరాబాద్ - ముంబై.. ముంబై- చెన్నయ్... చెన్నయ్ - హైదరాబాద్ అంటూ ప్రయాణాలతో నిరంతరం వినువీధి విహారం చేస్తోంది పూజా. అయితే ఈ భామకు విమాన యానంలో ఊహించని అవమానం ఎదురైంది. సిబ్బంది రూడ్ బిహేవియర్ తనను కలతకు గురి చేసిందట.
తన లైఫ్ లో ఎన్నడూ లేనిది పూజా చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. పూజా హెగ్డే ఇండిగో విమానం ఎక్కిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో వెల్లడించింది. తనతో ఇండిగో సిబ్బంది అసభ్య ప్రవర్తన గురించి ఆరోపించింది. ఎప్పుడూ ఫిర్యాదులపై ఆసక్తి కనబరచని పూజా ఇప్పుడు తన చేదు అనుభవాన్ని పంచుకోవడం ఆశ్చర్యపరిచింది.
``ఈరోజు ముంబై నుండి బయలుదేరిన మా విమానంలో విపుల్ నకాషే అనే పేరున్న సిబ్బంది మాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినందుకు చాలా విచారంగా ఉంది. ఎటువంటి కారణం లేకుండా మాపై అహంకారం ప్రదర్శించాడు. అజ్ఞానం తో బెదిరింపు టోన్ ని ఉపయోగించారు. సాధారణంగా నేను ఇలాంటి సమస్యల గురించి ట్వీట్ చేయను. కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది`` అని పూజ పోస్ట్ చేసింది. నిజానికి పూజా మనసు ఎంత తీవ్రంగా గాయపడితే ఇంతగా ఆరోపిస్తోందో తన టోన్ ని బట్టి అర్థమవుతోంది.
ప్రస్తుతం పూజా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెకకిస్తున్న `జనగణమన` సినిమాతో బిజీగా ఉంది. జూలైలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా సెట్స్ లో జాయిన్ కానుంది. అలాగే తన హిందీ కమిట్ మెంట్లను పూర్తి చేసే పనిలో ఉంది.