కాన్వాస్ పై అందాలు గీస్తున్న అందగత్తె

Update: 2016-04-17 07:30 GMT
సినీ పరిశ్రమలో నటీనటులుగా వెలిగిపోతున్న చాలామందికి.. తమ వ్యక్తిగత ఇష్టాలు వేరే ఉంటాయి. స్టార్లలో కొందరికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కాన్వాస్ పెయింటింగ్స్ గీస్తూ తమ ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నుంచి బ్యూటీ హన్సిక మొత్వానీ కూడా కాన్వాస్ పై తమ ప్రతిభను చూపుతూ ఉంటారు.

హన్సిక ఇలా సీరియస్ గా కాన్వాస్ పై చిత్రీకరిస్తున్న ఫోటోనే ఇక్కడ కనిపిస్తోంది. ముంబైలో తన సొంత ఇంట్లోనే ఇలా అత్యంత శ్రద్ధతో పెయింటింగ్స్ వేస్తోందీమె. ప్రస్తుతం బోలెడన్ని పెయింటింగ్స్ వేసే పనిలో ఉంది హన్సిక. వీటన్నిటినీ వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్మును తనే నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేయాలన్నది హన్సిక ఆలోచన.

గూడు లేని చిన్నారుల కోసం హన్సిక ఓ ఎన్టీఓను నడుపుతోంది. తను దత్తత తీసుకున్న 20మందిని ఇందులో పెంచుతోంది. వీళ్లందిరినీ  ఈ ఏడాది విదేశీ యాత్రలకు తీసుకెళ్లాలన్నది హన్సిక టార్గెట్. అందుకోసం ఇలా పెయింటింగ్స్ వేయగా వచ్చిన మొత్తాన్ని ఉపయోగించనుంది హన్సిక.
Tags:    

Similar News