• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్ వీడియో: కాబోయే భర్త...

వైరల్ వీడియో: కాబోయే భర్త మొదటి పెళ్లిలో సందడి చేసిన హన్సిక..!

By - Tupaki Desk
Update: 2022-11-05 11:59 GMT
యాపిల్ బ్యూటీ హన్సిక త్వరలో మోత్వానీ పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఆమె వివాహం మీద ఎన్నో రూమర్స్ వచ్చిన తర్వాత ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. సోహైల్ కతురియాతో ఏడడుగులు నడవబోతున్నట్లు ఇన్‌ స్టాగ్రామ్ పోస్ట్‌ తో ధృవీకరించింది. ఈఫిల్ టవర్ వద్ద సొహైల్ తనకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన ఫోటోలను పంచుకుంది.

అప్పటి నుంచి నెట్టింట హన్సిక పెళ్లి గురించి మరియు ఆమెకు కాబోయే భర్త ఎవరనే విషయం మీద వార్తలు వస్తున్నాయి. పెళ్లి వేడుక ఎప్పుడు ఎక్కడ ఎలా జరగబోతోందనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక పెళ్లి చేసుకోబోయేది తన స్నేహితురాలి భర్తనే అనే విషయం తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. హన్సిక తన ఫ్రెండ్ మ్యారేజ్ ని దగ్గరుండి జరిపించింది.

హన్సిక కాబోయే భర్త సోహైల్ కతురియా ఫస్ట్ వెడ్డింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో ఉంది. సోహైల్ 2016లో రింకీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. గోవాలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు వీరిది ప్రేమ వివాహం అని కూడా తెలుస్తుంది.

సోహైల్ కతురియా - రింకీ వివాహ వేడుకలో హన్సిక కూడా పాల్గొని హ్యాపీగా డ్యాన్స్ చేయడం గమనార్హం. రోకా వేడుక - పూల్ పార్టీ మరియు సంగీత్ లలో ఆమె డ్యాన్స్ చేస్తూ కనిపించింది. హన్సిక కాబోయే భర్త మొదటి పెళ్ళిలో హన్సిక ఫోటోలు.. పర్ఫెక్ట్ ఫిట్ అంటూ యూట్యూబ్ లో ఉన్న వెడ్డింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి 'ఇమ్ పర్ఫెక్ట్ ఫిట్' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి రింకీ మరియు సోహైల్ కతురియా సోదరిలకు హన్సిక మంచి ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో హన్సిక - సోహైల్ మధ్య స్నేహం కుదిరింది. చాలా కాలంగా స్నేహితులుగా కొనసాగుతున్న వీరిద్దరూ కలిసి ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా నడుపుతున్నారు. హన్సిక సోదరుడి వివాహానికి కూడా సోహైల్ హాజరయ్యాడు. అతను రింకీ తో ఎందుకు విడిపోయాడో తెలియదు కానీ.. ఇప్పుడు హన్సిక తో పెళ్ళికి రెడీ అయ్యాడు.

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఆల్రెడీ పెళ్ళై విడాకులు తీసుకున్న వ్యాపారవేత్తలు మరియు యాక్టర్స్ ని వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు హన్సిక సోహైల్ ను వివాహం చేసుకోవడం విచిత్రమైనది కాదు. కాకపోతే ఆమె కాబోయే భర్త మొదటి పెళ్ళి దగ్గరుండి చేయడం.. అతని రెండో భార్యగా వెళ్తుండటంతో ఈ టాపిక్ ట్రెండింగ్ అవుతోంది.

ఇదిలా ఉంటే డిసెంబర్ 4న జైపూర్‌ లో హన్సిక సోహైల్ కతురియా డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    
  • ActressHansikaMotwani 
  • SohailKathuria 
  • HansikaSohailEngaged 
  • CelebrityCouple 
  • SohailSecondMarriage 
  • Rinky 
  • FilmIndustry 
  • Movienews 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS