ఆ దెబ్బకు హన్సికకు జ్వరమొచ్చేసింది
20 గంటల వ్యవధిలో నాలుగు సార్లు.. అలసిపోరూ...!! హన్సికకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవును.... ఒకే రోజులో నాలుగుసార్లు విమాన ప్రయాణాలు చేస్తూ అలసిపోతోందట హన్సిక. కొద్దికాలం బిజీ షెడ్యూల్ ఉన్నందున ఈ చబ్బీ చీక్స్ హీరోయిన్ విమానాల్లో తెగ తిరుగుతోందట. అయితే... ఆ ప్రయాణాలు మరీ ఎక్కువ కావడంతో బడలిక స్థాయి జ్వరం పెట్టుకునేవరకు వచ్చింది.
మొన్నీమధ్య ఓ రోజు ఇలాగే షూటింగులు, విమానాల్లో తిరగడంతో అస్సలు ఖాళీలేకపోయిందట. దాంతో ఆమెకు గొంతు ఇన్ఫెక్ట్ కావడమే కాకుండా విపరీతమైన జ్వరం కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ షూటింగులకు వెళ్లాల్సివస్తోందని... చాలా ఇబ్బందిగా ఉందని హన్సిక ఆవేదన చెందుతోంది. పాపం తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ట్విటిజన్లతో షేర్ చేసుకుంది. ''అనారోగ్య పరిస్థితుల్లో.. ఇలాంటివాతావరణంలో పనిచేయాలంటే అయిష్టంగా ఉంది'' అంటూ ట్వీట్ చేసింది. మరి హన్సిక ఉద్దేశం ప్రకారం అలాంటి వాతావరణం.. అలాంటి పరిస్థితులు అంటే సినీరంగంలో ప్రస్తుత పరిస్తితులా.... ఆమె బడలిక, అనారోగ్యం గురించా అన్నది ఆమే చెప్పాలి.