గుణ ఇస్పీడ్ చూశారా.. శాకుంత‌లం టాకీ ఫినిష్‌!

Update: 2021-08-13 06:30 GMT
అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌ధాన‌ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం శాకుంత‌లం. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నీలిమ గుణ‌శేఖ‌ర్ నిర్మాత‌. ఈ చిత్రంతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వార‌సురాలు అల్లు అర్హ బాల‌న‌టిగా తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిన‌దే. ఇటీవ‌లే అర్హ‌పై వారం పాటు స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను గుణ‌శేఖ‌ర్ పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా సెండాఫ్ వేడుక‌లో బ‌న్ని-స్నేహ జంట అర్హ అండ్ టీమ్ తో చీర‌ప్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. `శాకుంత‌లం`లో కథానాయ‌కుడి పాత్ర‌ను పోషస్తున్న‌ హిందీ న‌టుడు దేవ్ మోహ‌న్ వేడుక‌లో పాల్గొన్నారు.

అయితే ఇంత‌లోనే శాకుంత‌లం టాకీ పూర్త‌యింది అంటూ క‌బురు అందింది. చూస్తుంటే గుణ‌శేఖ‌ర్ కెరీర్ లోనే జెట్ స్పీడ్ తో ఈ సినిమాని పూర్తి చేశారా? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మార్చి మిడ్ లో మొద‌లు పెట్టి ఆగ‌స్టు మిడ్ నాటికే ఈ సినిమాని పూర్తి చేసారు గుణ‌. స‌మంత‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ఇన్ టైమ్ లోనే పూర్తి చేసారు. అస‌లే క‌రోనా క్రైసిస్ తో గ‌జ‌గ‌జ‌లాడుతున్న ఇండ‌స్ట్రీకి ఈ వేగం చాలా అవ‌స‌రం అన్న పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. ఏళ్ల త‌ర‌బ‌డి సినిమా చిత్రీక‌ర‌ణ‌ల్ని సాగ‌దీస్తే అది క్రైసిస్ కి కొన‌సాగింపు కిందే లెక్క‌. అలా కాకుండా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌.. అంతకుమించిన వేగం చాలా అవ‌స‌రం అన్న విశ్లేష‌ణ సాగుతోంది.

శాకుంత‌లం చివ‌రిరోజు చిత్రీక‌ర‌ణ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో పూర్త‌యింది అంటూ చిత్ర‌బృందం మీడియాకి వెల్ల‌డించింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత -గుణ‌శేఖ‌ర్ - నీలిమ త‌దిత‌రులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

గుణ నెక్ట్స్ .. ప్ర‌తాప‌రుద్రుడు..?

రుద్ర‌మ‌దేవి త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ సుదీర్ఘ విరామం తీసుకుని శాకుంత‌లం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఆయ‌న ఎంపిక చేసిన స్క్రిప్టుల‌ లైన‌ప్ చాలా పెద్ద‌దే అయినా అవేవీ సెట్స్ కెళ్ల‌లేదు. ఇటీవ‌ల కొన్నేళ్లుగా హిర‌ణ్య క‌శిప చిత్రంపై దృష్టి సారించారు. రానా క‌థానాయ‌కుడిగా సురేష్ బాబు కాంపౌండ్ తో క‌లిసి స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాని తెర‌కెక్కించాల్సి ఉండ‌గా ఎందుక‌నో వీలుప‌డలేదు. క‌రోనా మ‌హ‌మ్మారీ చాలా ప్ర‌ణాళిక‌ల‌కు బ్రేక్ వేసింది. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో గుణ‌శేఖ‌ర్ పూర్తిగా శాకుంత‌లం క‌థ‌పై దృష్టి సారించి ఆ సినిమాని శ‌ర‌వేగంగా పూర్తి చేయ‌గ‌లిగారు. శాకుంత‌లం త‌ర్వాత గుణ భారీ ప్లానింగ్స్ తో ఉన్నారు.

ఆయ‌న రుద్ర‌మ‌దేవి మ‌న‌వ‌డు ప్ర‌తాప‌రుద్రుడి విరోచిత పోరాటాల క‌థ‌తో సీక్వెల్ ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్ప‌టికే సంతృప్తిక‌రంగా స్క్రిప్టును కూడా రెడీ చేసి సిద్ధంగా ఉన్నాన‌ని గుణ తెలిపారు. నిజానికి అనుష్క రుద్ర‌మ‌దేవి రిలీజ్ అనంత‌రం ఈ సినిమా చేసేందుకు గుణ‌శేఖ‌ర్ ఉవ్విళ్లూరినా రుద్ర‌మ‌దేవి ఫ్లాప‌వ్వ‌డంతో ఆ మాట మ‌ళ్లీ తీయ‌లేదు. ఇన్నాళ్టికి ఈ లాక్ డౌన్ తీరిక స‌మ‌యంలో ప్ర‌తాప‌రుద్రుడి స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నార‌ని తెలిసింది.

అలాగే త‌న‌ని గోన‌గ‌న్నారెడ్డి పై సినిమా తీయాల‌ని ప‌లువురు ఒత్తిడి తెచ్చినా కానీ ఆ పాత్ర ప‌రిధి ప‌రిమితం కావ‌డంతో తీయ‌లేన‌ని తెలిపారు. అన‌వ‌స‌ర క‌ల్పితాల‌తో హిస్ట‌రీని వ‌క్రించే ఆలోచ‌న లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌తాప‌రుద్రుడు చిత్రాన్ని బ‌హుశా రుద్ర‌మ‌దేవికి సీక్వెల్ గా స్టార్ట్ చేసే వీలుంది. అయితే ముందుగా హిర‌ణ్య‌క‌శిప చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. రానా ప్ర‌ధాన పాత్ర‌లో హిర‌ణ్య‌క‌శిప బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ఈ చిత్రాల‌కు అసాధార‌ణ బ‌డ్జెట్ అవ‌స‌రం అన్న‌ది ఓ విశ్లేష‌ణ‌.


Tags:    

Similar News