ఆన్ లొకేష‌న్ .. భ‌య‌పెట్టే భూతం ఏమిటంటే?

Update: 2020-06-09 04:45 GMT
50 మందితో సినిమాల షూటింగులా?  పైగా ఆన్ లొకేష‌న్ సామాజిక దూరం పాటించాలి. శానిటైజేష‌న్ స‌హా అన్ని కొవిడ్ 19 రూల్స్ పాటించాలి. ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అంటే పెదవి విరిచేస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా ఫిలిం షూటింగ్స్ ఈ ప్రాతిప‌దిక‌న చేయ‌డం అసాధ్యం అన్న వివ‌ర‌ణ ఇస్తున్నారు నిపుణులు.

ఇదిలా ఉంటే ఇంకా ఎవ‌రిలోనూ క‌రోనా భ‌యం పోలేదు. ఇంకా వైర‌స్ వెంటాడుతుంద‌నే భ‌యం అలానే ఉంది. అది భూతంలా ఎట్నుంచి ఎలా వ‌స్తోందో ఎవ‌రికీ అర్థం కాని స‌న్నివేశం ఉండ‌డంతో హీరోలంతా బెంబేలెత్తుతున్నారు. పెద్ద హీరోలు.. ఏజ్ బార్ హీరోలు అయితే బెదిరిపోతున్నార‌ట‌. మీడియం రేంజ్ హీరోలు.. స్టార్ స్టేటస్ ఉన్న టెక్నిషన్స్ ఎవరు షూటింగ్స్ కి రాలేమ‌ని చెప్పేస్తున్నార‌ట‌.

ఈ స‌న్నివేశం ఊహించ‌నిది. నిర్మాత‌ల పాలిట అదో ర‌కం శాపంలా మారింద‌ని భావిస్తున్నారు. ఏవో టీవీ సీరియల్స్ షూటింగ్స్ కి మాత్రమే ఇది ఉపయోగం..! అని చెబుతున్నారు. సీరియ‌ళ్ల‌కు 50 మందితో చిత్రీక‌ర‌ణ‌లు చేయ‌డం సాధ్య‌మే. అయితే రూల్స్ పాటించ‌డ‌మే కాస్త క‌ష్టం. ఇలా కాకుండా ప‌రిశ్ర‌మ య‌థాత‌థంగా పూర్వ స్థితికి రావాలంటే.. ముందు జనాల్లో కరోనా భయం పోవాలి..! అలా జరగాలి అంటే వాక్సిన్ రెడీ కావాలి. ట్రంపు 20వేల వ్యాక్సిన్ శాంపిల్స్ రెడీ చేశామ‌న్నారు. మ‌రి అవి స‌క్సెస‌వుతాయా?  ఇండియాలోనూ వ్యాక్సిన్ క‌నిపెడ‌తారా? ఇదంతా ఇప్ప‌టికైతే ఫ‌జిల్ లాంటిదే.
Tags:    

Similar News