ఆలియాపై ఆ గుస‌గుస‌ల్లో నిజానిజాలెంత‌?

Update: 2021-05-09 04:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఆలియాభ‌ట్ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట వివాహం ఈపాటికే జ‌ర‌గాల్సింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా వేశారు. ఆలియా కంటే ముందే దీపిక - క‌త్రిన‌తోనూ ర‌ణ‌బీర్ ప్రేమాయ‌ణాలు సాగించాడు. అయితే ప్రేమలో ఉండే ర‌క‌ర‌కాల వ్యామోహాల అనంత‌రం ఈ భామ‌లంతా అత‌డి నుంచి విడిపోవ‌డం ఆ క్ర‌మంలోనే డిప్రెష‌న్ లోకి వెళ్లడం తెలిసిన‌దే.

ఇప్పుడు ఆలియా మ‌రోసారి తీవ్ర మాన‌సిక ఒత్తిడి ని ఎదుర్కొటున్నాన‌ని అన‌డంతో అభిమానులు ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుక‌ని ర‌ణ్ బీర్ క‌పూర్ ని ప్రేమించిన లేదా ప్రేమిస్తున్న వారంతా ఇలా మెంట‌ల్ హెల్త్ గురించి మాట్లాడుతుంటారు? ఒక‌ప్పుడు దీపిక - ర‌ణ్ బీర్ క‌పూర్ ఓ రేంజ్ ల‌వ్ లో కొన‌సాగారు. అయితే వీరిద్ద‌రకి బ్రేక్ అప్ అయ్యాక‌ దీపిక డిప్ర‌ష‌న్ లోకి వెళ్లి మ‌ళ్లీ తానే బ‌య‌ట‌ప‌డిన‌ట్లుగా చాలా సార్లు బ‌హిరంగ వేదిక‌ల‌పై వెల్ల‌డించారు.

ఇప్పుడు ఆలియాతో ర‌ణ‌బీర్ రిలేష‌న్ షిప్ లో ఉన్నాడు. తాజాగా ఈ బ్యూటీ కూడా మెంట‌ల్ హెల్త్ గురించి కొటేష‌న్లు ఇస్తోంది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్యా ల‌వ్ సైడ్ ట్రాక్ అయిందేమో అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఈ జంట పెళ్లికి సంబంధించిన ఏ వివ‌రం రాక‌పోవ‌డం కూడా ప‌లు సందేహాల‌కు తావిస్తోంద‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అయితే ర‌ణ‌బీర్ కానీ ఆలియా కానీ అధికారికంగా ఏదైనా వెల్ల‌డించేవ‌ర‌కూ ఇవ‌న్నీ రూమ‌ర్లు మాత్ర‌మేన‌ని భావించాలి. మ‌రోవైపు సెకండ్ వేవ్ ప్ర‌మాద‌క‌రంగా మార‌డంతో ప్ర‌జ‌ల మాన‌సిక ఆరోగ్యం గురించి ఆలియా ఇత‌ర సెల‌బ్రిటీలు ప్ర‌స్థావిస్తున్నారు. మాన‌సికంగా ధృఢంగా ఉండాల‌ని పిలుపునిస్తున్న సంగ‌తి  తెలిసిన‌దే.
Tags:    

Similar News