2025 యూఎస్ బాక్సాఫీస్: ఏ ఇండస్ట్రీకి ఎంత వచ్చింది?

అమెరికా బాక్సాఫీస్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కీలకమైన రెవన్యూ సోర్స్ గా మారిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-02 11:11 GMT

అమెరికా బాక్సాఫీస్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కీలకమైన రెవన్యూ సోర్స్ గా మారిన విషయం తెలిసిందే. నార్త్ యూఎస్ లో దాదాపు ఇండియన్ మూవీలు మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. అయితే ఇప్పుడు 2025 లో గతంలో కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. మరి గత ఏడాది భారతీయ సినిమాలు సాధించిందెంత?.. ఏ ఇండస్ట్రీకి ఎంత వచ్చింది?

2025లో నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద భారతీయ సినిమాలు ఓవరాల్ గా సుమారు 151 మిలియన్ డాలర్లు వసూలు చేశాయని అంచనా. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువ. ఓవర్సీస్ ఇండియన్స్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుండడంతోపాటు భారతీయ సినిమాలపై ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరగడం అందుకు ప్రధాన కారణం.

అయితే 2025 వసూళ్లలో బాలీవుడ్ టాప్ లో నిలిచింది. హిందీ చిత్రాలు.. నార్త్ యూఎస్ లో సుమారు 62.5 మిలియన్ డాలర్లు వసూలు చేశాయని సమాచారం. హిందీ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ రెండో స్థానంలో నిలిచింది. టాలీవుడ్ చిత్రాలు నార్త్ అమెరికాలో 36.5 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం.

భారీ బడ్జెట్ చిత్రాలు, పండుగల టైమ్ లో విడుదలయ్యే ఎంటర్టైనర్లు, నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకుల మద్దతు టాలీవుడ్‌ కు మెయిన్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇక మూడో స్థానంలో పంజాబీ సినిమాలు నిలిచాయి. సుమారు 20 మిలియన్ డాలర్లు వసూలు చేసి కంటెంట్ ఆధారిత సినిమాలకు కూడా భారీ మార్కెట్ ఉందని నిరూపించాయి.

పంజాబీ చిత్రాల తర్వాత తమిళ సినిమాలు 15.7 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. కమర్షియల్ తోపాటు ప్రయోగాత్మక జోనర్ లో రూపొందిన కోలీవుడ్ మూవీస్ కు మంచి ఆదరణ లభించింది. మలయాళ సినిమాలు గతం కన్నా భారీగా రాబట్టాయి. సుమారు 10.6 మిలియన్ డాలర్లు వసూలు చేసి మాలీవుడ్ సత్తా చాటాయి. కన్నడ సినిమాలు 5.3 మిలియన్ డాలర్లు, గుజరాతీ వంటి ఇతర భాషా చిత్రాలు సుమారు మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.

అయితే 2025లో నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ధురంధర్ సుమారు 17.52 మిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు 2026లో కూడా దూసుకుపోతోంది. ధురంధర్ తర్వాత స్థానాల్లో సైయారా, L2: ఎంపురాన్, లోకా: చాప్టర్ 1 - చంద్ర, కాంతార: చాప్టర్ 1, ఛావా, వార్ 2 వంటి చిత్రాలు అన్నారు.

తెలుగు సినిమాల విషయానికి వస్తే, 2025లో నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఓజీ 5.8 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్ లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం 3 మిలియన్ డాలర్లు, మిరాయ్ సుమారు 3 మిలియన్ డాలర్లు, హిట్: ది థర్డ్ కేస్ 2.3 మిలియన్ డాలర్లు, అఖండ 2: తాండవం 1.4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి.

Tags:    

Similar News