సినిమా బడ్జెట్.. '40-50-10' సీక్రెట్ ఇదే

సినిమా అంటేనే వందల కోట్ల వ్యవహారం. కానీ ఆ వందల కోట్లు ఎక్కడెక్కడికి వెళ్తాయి? హీరో రెమ్యునరేషన్ ఎంత? మేకింగ్ కి ఎంత? అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి.;

Update: 2026-01-02 12:36 GMT

సినిమా అంటేనే వందల కోట్ల వ్యవహారం. కానీ ఆ వందల కోట్లు ఎక్కడెక్కడికి వెళ్తాయి? హీరో రెమ్యునరేషన్ ఎంత? మేకింగ్ కి ఎంత? అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. దీనిపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. సినిమా బడ్జెట్ ని మూడు భాగాలుగా విడగొట్టి, ఒక సినిమాకి సంబంధించిన హెల్దీ ప్రపోర్షన్ ఎలా ఉంటుందో ఆయన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన చెప్పిన ఈ లెక్కలు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

నాగ వంశీ చెప్పిన దాని ప్రకారం.. ఒక సినిమా బడ్జెట్ లో 40 శాతం రెమ్యునరేషన్స్ కే వెళ్తుందట. అంటే హీరో, డైరెక్టర్, ఇతర నటీనటుల పారితోషికాలకే సగం దగ్గరకు బడ్జెట్ అయిపోతుందన్నమాట. స్టార్ హీరోలు ఉన్న సినిమాలకు ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఐడియల్ గా 40 శాతం అనేది ఒక సేఫ్ ఫిగర్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక సినిమా తయారీకి అంటే ప్రొడక్షన్ కి 50 శాతం బడ్జెట్ కేటాయిస్తారట. అంటే సెట్స్, కాస్ట్యూమ్స్, టెక్నీషియన్స్, షూటింగ్ ఖర్చులు అన్నీ ఇందులోకే వస్తాయి. మేకింగ్ క్వాలిటీ బాగుండాలంటే ఈ 50 శాతం చాలా కీలకం. కొన్ని సినిమాలకు ఈ శాతం 60 వరకు వెళ్లినా తప్పులేదని, 'కింగ్‌డమ్' వంటి సినిమాల్లో మేకింగ్ కే ఎక్కువ ఖర్చు పెట్టామని ఆయన ఉదాహరణగా చెప్పారు.

చివరిగా మిగిలిన 10 శాతం ప్రింట్స్ అండ్ అడ్వర్టైజింగ్ కి కేటాయిస్తారట. సినిమా రిలీజ్ అయ్యాక పబ్లిసిటీ, థియేటర్లకు ప్రింట్లు పంపడం వంటి ఖర్చులన్నీ ఈ పది శాతంలోనే కవర్ అవ్వాలి. ప్రమోషన్స్ గట్టిగా చేయాలంటే ఈ బడ్జెట్ కూడా ముఖ్యమే. ఈ 40-50-10 ఫార్ములా అనేది ఒక హెల్దీ ప్రపోర్షన్ అని, దీన్ని ఫాలో అయితే సినిమా బడ్జెట్ కంట్రోల్ లో ఉంటుందని ఆయన వివరించారు.

అయితే కొన్ని చిన్న సినిమాలకు ఈ లెక్కలు మారొచ్చు. ఉదాహరణకు 'మ్యాడ్ స్క్వేర్' లాంటి సినిమాలకు 50-50 ఫార్ములా నడిచిందట. అంటే రెమ్యునరేషన్స్, మేకింగ్ దాదాపు సమానంగా ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు మేకింగ్ కి 60 శాతం, రెమ్యునరేషన్స్ కి 40 శాతం కూడా ఉంటుందని, ఇది సినిమా స్థాయిని బట్టి మారుతుందని క్లారిటీ ఇచ్చారు.

నాగ వంశీ చెప్పిన ఈ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తో సినిమా బిజినెస్ మీద సామాన్యులకు కూడా ఒక అవగాహన వచ్చింది. హీరోల రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు, మేకింగ్ కి పెట్టే ఖర్చు కూడా సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుందని అర్థమవుతోంది. ఈ 40-50-10 ఫార్ములాని పక్కాగా అమలు చేస్తే నిర్మాతలకు టెన్షన్ ఉండదని ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News