ఫోటో స్టోరి: చ‌పాక్ సుంద‌రి ఫ‌స‌క్

Update: 2019-12-24 10:36 GMT
అందాల దీపిక ప‌దుక‌నే న‌టించిన చ‌పాక్ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా థియేట‌ర్ల‌ లోకి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు.. సోష‌ల్ యాక్టివిస్ట్ ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత‌క‌థ‌లో న‌టించిది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారంలో దీపిక బిజీ బిజీగా గ‌డిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ గా మీడియా ఇంట‌రాక్ష‌న్స్ తో క్ష‌ణం తీరిక లేకుండా త‌న సినిమాని ప్ర‌చారం చేసుకుంటోంది.

ఇక ఈ ప్ర‌చారంలోనే అదిరి పోయే ఫోటోషూట్ల‌ తో వేడెక్కిస్తోంది. ఇదిగో లేటెస్టుగా అంత‌ర్జాలంలో రిలీజైన దీపిక ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. దీపిక బ్యాక్ లెస్ ఫోజులో కిర్రాక్ పుట్టిస్తోంది. ఆరెంజ్ క‌ల‌ర్ ఆఫ్ షోల్డ‌ర్ ఫ్రాకు ధ‌రించినా ఆ వీపు అందాల్ని ప‌బ్లిక్ కి ప్ర‌ద‌ర్శించిన దీపిక అల్ట్రా మోడ్ర‌న్ క్వీన్ ని త‌ల‌పించింది.

ఆఫ‌ర్ట్ మ్యారేజ్ ర‌ణ‌వీర్ సింగ్ తో ప‌బ్లిక్ లోనే చెల‌ రేగుతూ కాస్త బోల్డ్ గానే ట్రీటిస్తున్న దీపిక వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ప‌రిధి మేర అందాల్ని ఆర‌బోస్తూనే ఉంది. ఇప్పుడిలా డిజైన‌ర్ లుక్ లో క‌నిపిస్తూనే కుర్రాళ్ల గుండెల్లో వేడి పెంచే ప్ర‌య‌త్నం చేసింది. చ‌పాక్ ప్ర‌చారం కోస‌మే ఇదంతా. ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రం త‌ర్వాత భ‌ర్త‌ తో క‌లిసి న‌టించిన‌ 83 చిత్రం రిలీజ్ కి రానుంది.


Tags:    

Similar News