కాజల్ ని పక్కన పెట్టి కీర్తికి తేజ ఛాన్స్!
నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజకు చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రయత్నం విఫలమైంది. అటుపైనా ఓ సినిమా చేస్తే ఐపు లేదు. ఇటీవల తేజ ఓ రెండు చిత్రాల్ని ప్రకటించారు. ఆ రెండిటి టైటిల్స్ వెల్లడించినా వాటిలో హీరోల పేర్లు లీక్ చేయలేదు. రాక్షస రాజు రావణాసురుడు.. అలిమేలు మంగ వెంకట రమణ అనే టైటిల్స్ తో సినిమాల్ని ప్రకటించాడు.
వీటిలో గోపిచంద్ కథానాయకుడిగా `అలిమేలు మంగ వెంకట రమణ` తెరకెక్కనుందని తాజాగా రివీలైంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుందని ప్రచారమైనా.. తాజా సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ నాయికగా నటించనుందని తెలుస్తోంది. మహానటి లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించాక కీర్తి కి కెరీర్ పరంగా ఆశించిన మైలేజ్ రాలేదు. ఆ క్రమంలోనే అటు బాలీవుడ్ లో ఓ సినిమాకి కమిటైంది. ఇప్పుడు గోపిచంద్ సరసన సరైన ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఇది కాజల్ లాస్ అయితే తనకు దక్కినదా? లేక ఇందులో రెండో కథానాయికగా కనిపిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
లక్ష్మీ కళ్యాణం- నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ తో కాజల్ మరో సినిమా చేస్తోంది అనుకుంటుండగానే కీర్తి పేరు వైరల్ గా మారింది. ఇక రాక్షస రాజు రావణాసురుడు టైటిల్ బావుంది. ఇందులో నటించే హీరో ఎవరు? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు. అయితే తేజ ఎందుకని హీరోల పేర్లు రివీల్ చేయలేదో చూడాలి.