• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరవింద్ గారి బ్యానర్లో...

అరవింద్ గారి బ్యానర్లో చేయడానికి ఇంతకాలం పట్టింది!

By - Tupaki Desk
Update: 2022-06-04 01:30 GMT
గోపీచంద్ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన మారుతి దర్శకత్వంలో ' పక్కా కమర్షియల్' సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ 2 - యూవీ వంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ .. "నేను ఈ సినిమా చేయడానికి కారణం .. యూవీ వంశీ. 'జిల్' సినిమా తరువాత సరైన స్టోరీ దొరక్కపోవడం వలన వెయిట్ చేస్తూ వచ్చాము.

ఒక రోజున వంశీ కాల్ చేసి మారుతి ఒక కథ చెబుతాడు .. విని ఎలా ఉందో చెప్పండి అన్నాడు. మారుతి ఫస్టాఫ్
చెప్పగానే సెకండాఫ్  కూడా చెప్పేయమని అన్నాను. కథ అంతా విన్న తరువాత చాలా బాగుందని అన్నాను. మొహమాటానికి నేను అలా అన్నానేమో అనుకుని మళ్లీ వంశీగారు నన్ను అడిగారు  .. కథ ఎలా ఉందండీ అని. నిజంగానే చాలా బాగుందండీ .. తప్పకుండా చేద్దాం అన్నాను.  అలా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అంతకుముందు మారుతితో నాకున్న పరిచయం కూడా తక్కువ.

అయితే షూటింగ్ స్పాట్ కి వెళ్లిన తరువాత నాకు చాలా సన్నిహితుడితోనే కలిసి వర్క్ చేస్తున్నట్టుగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మంచి వేవ్ లెంగ్త్  సెట్టైపోయింది. 'రణం' .. ' లౌక్యం' మాదిరిగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి మంచి స్కోప్ ఉందనిపించింది. మారుతి కామెడీ చాలా బాగా రాశాడు.  సెట్లో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ చేశాము. ఆయన ఏదైతే రాసుకున్నాడో అది నేను డెలివర్  చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారని అడిగితే  రాశి ఖన్నా అని చెప్పారు.

రాశి ఖన్నా చాలా టాలెంటెడ్  .. కాకపోతే తనకి  ఇంతవరకూ సరైన పాత్రలు పడలేదు. ఈ సినిమాలో తను చాలా బాగా చేసింది. అరవింద్ గారికి ఇండస్ట్రీలో ఉన్న అనుభవం గురించి అందరికీ తెలిసిందే. ఆయన కనిపించినప్పుడల్లా టిప్స్ అడుగుతూ ఉండేవాడిని. 'మీ రూట్లో మీరు ముందుకు వెళ్లండి' అనేవారు. ఆయన బ్యానర్లో చేయడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. బన్నీవాసు గురించి నేను విన్నాను. తన చేతిలో పడిన కథను ఆయన ఏ స్థాయికి తీసుకుని వెళతాడనేది తెలుసు. అందువలన ఈ సినిమా సగం సక్సెస్ అయినట్టే అనుకున్నాను.

బన్నీ వాసు మీద ఎంత నమ్మకమైతే  ఉందో ... మారుతిపై కూడా అంతే నమ్మకం ఉంది. ఆయన కూడా తన శక్తిమేరా  కష్టపడ్డాడు. ఈ సినిమా  హండ్రెడ్  పర్సెంట్ సక్సెస్  అవుతుందనే  నమ్మకంతో ఉన్నాను. టైటిల్ కి తగినట్టుగా ఇది పక్కా కమర్షియల్ సినిమా. జూలై 1వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.  
Tags:    
  • Pakka Commercial 
  • Gopichand 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS