• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమాతో అతని కెరీర్...

ఆ సినిమాతో అతని కెరీర్ మలుపు తిరుగుతుందా?

By - Tupaki Desk
Update: 2016-11-22 22:30 GMT
బడా స్టార్ సినిమాలకు టెక్నీషియన్లుగా పనిచేస్తే అప్పటివరకూ రాని పేరు, కీర్తి ఒకేసారి వచ్చిపడుతుంది. ముఖ్యంగా సంగీత విభాగంలో ఈ సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. టాలెంటడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి మనకు కొదవలేదు. అయితే జక్కన్న కీరవాణిని పట్టుకున్నట్టు - సుకుమార్ - కొరటాలలు దేవికి ట్యూన్ అయినట్టు - శ్రీనువైట్ల థమన్ కి ఫిక్స్ అయినట్టు ప్రతీ పెద్ద డైరెక్టరూ తమకు ట్యూన్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ నే పెట్టుకోవడంతో కొత్తవాళ్ళకు సరైన గుర్తింపు లేదనే విమర్శ కూడా వస్తుంది.

అయితే మహేష్ బాబు త్వరలో నటించబోయే సినిమాలో టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం లభించినట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ - మురగదాస్ ల చిత్రానికి హారిస్ జయరాజ్ స్వరాలను సమకూరుస్తున్నాడు. సైనికుడు - ఆరెంజ్ ల తరువాత అతను చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. ఆ తరువాత మహేష్ - కొరటాల మూవీకి ఎలానో దేవికి ఫిక్స్ అయ్యాడు.

ఇక మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ ఫిలింకానున్న తన 25వ సినిమా పి.వి.పి బ్యానర్ లో వంశీ పైడిపల్లితో వుండనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయనున్నట్టు సమాచారం. భలే భలే మగాడివోయ్, ఊపిరి చిత్రాలకు పనిచేసిన గోపీసుందర్ కి ఇదొక సువర్ణావకాశం. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ల జాబితాలో నిలుస్తాడనడంలో సందేహం లేదు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gopi Sunder 
  • Mahesh Babu 
  • Telugu news 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS