• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈసారి కూడా గోపీచంద్‌...

ఈసారి కూడా గోపీచంద్‌ వచ్చి వెళ్లడమేనా.. నిలిచేనా?

By - Tupaki Desk
Update: 2022-03-30 16:30 GMT
హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్లాప్‌ మూట కట్టుకోవడంతో విలనిజంతో తన స్టార్‌ డమ్‌ ను పెంచుకున్న గోపీచంద్‌ మళ్లీ హీరోగా చేసి నెగ్గాడు. విలన్ గా చేసిన సినిమాల  గుర్తింపు తో హీరోగా సక్సెస్ అయ్యాడు. అయితే హీరోగా మళ్లీ ప్లాప్ లు పడటంతో గోపీచంద్‌ పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. గోపీచంద్‌ సినిమాలు వస్తూ వెళ్తున్నాయి.. కాని వచ్చి వెళ్లినట్లుగా చాలా మందికి తెలియడం లేదు అంటూ కామెంట్స్ చేసే వారు చాలా మంది ఉన్నారు.

ఆయన సినిమాలు గతంలో మాదిరిగా జనాలకు చేరువ అవ్వడం లో పూర్తిగా విఫలం అవుతున్నాయి. దాంతో ఆయన నుండి సినిమా వస్తుందన్నా... వచ్చిందన్నా కూడా జనాలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. సినిమా విడుదల తర్వాత అప్పుడే వచ్చి పోయిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గోపీచంద్‌ వరుస ప్లాప్ లకు చెక్‌ పెట్టేందుకు పక్కా కమర్షియల్‌ సినిమా ను మారుతి తీసుకు రాబోతున్నాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న మారుతి పై చాలా ఆశలు పెట్టుకుని గోపీచంద్‌ ఈ సినిమాను చేశాడు. ఇప్పటికే పక్కా కమర్షియల్‌ లో గోపీచంద్‌ లుక్‌ చూస్తుంటే కాస్త అంచనాలు అయితే కలుగుతున్నాయి. కాని ఇప్పటి వరకు కూడా జనాలు ఈ సినిమా పై గురి పెట్టుకుని లేరు. సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే పాజిటివ్‌ టాక్ ను బట్టి చూద్దాం అన్నట్లుగా ప్రేక్షకులు ఉన్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈమద్య కాలంలో గోపీచంద్‌ నుండి వచ్చిన సినిమాలు వేరు.. ఈ పక్కా కమర్షియల్‌ సినిమా వేరు. ఖచ్చితంగా ఇది టైటిల్‌ కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్‌ మూవీ అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈసారి వచ్చి వెళ్లడం కాకుండా.. ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద గోపీచంద్‌ కమర్షియల్‌ గా సందడి చేయడం ఖాయం అని.. చాలా కాలం తర్వాత గోపీచంద్‌ ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద హడావుడి చేయడం మనం చూడబోతున్నాం అంటూ మారుతి అభిమానులు ధీమాగా ఉన్నారు.

కరోనా సమయంలోనే ప్రారంభించిన ఈ సినిమా ను గత ఏడాది అక్టోబర్ లో విడుదల చేస్తాం అంటూ మారుతి ప్రకటించాడు. షూటింగ్‌ కూడా ప్రారంభించకుండా విడుదల తేదీని ప్రకటించిన మారుతి అందరి దృష్టిని ఆకర్షించాడు. షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన పక్కా కమర్షియల్‌ సినిమాను జులై 1వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ నటించిన రంగరంగ వైభవంగా సినిమా కూడా జులై 1వ తారీకున విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ సినిమా విడుదల తేదీ వచ్చిన కొన్ని గంటల్లోనే పక్కా కమర్షియల్‌ విడుదల తేదీని ప్రకటించారు. రెండు సినిమాలు కూడా మీడియం రేంజ్ సినిమాలే కనుక ఎక్కువ నష్టం ఉండక పోవచ్చు. కాని ఏ సినిమాకైనా నెగటివ్‌ టాక్‌ వస్తే కచ్చితంగా కలెక్షన్స్ పై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది.
Tags:    
  • Pakka Commercial 
  • Gopichand 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS