ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..!
టాలీవుడ్ స్టార్ నందమూరి ఎన్టీఆర్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అలరించనున్నాడు. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. ఈ విషయంలో నందమూరి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనేది విదితమే. కానీ అలాంటి టాలెంట్ దేశవ్యాప్తంగా తెలియాలనేది ఫ్యాన్స్ కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫేమ్ అందుకోనున్నాడు.
అయితే మూవీస్ సంగతి పక్కనపెడితే.. అందరి జీవితంలో స్పెషల్ డేస్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ప్రత్యేకం కాకపోవచ్చు. కానీ వాటిని మనం సెలెబ్రేట్ చేసుకునే విధానం బట్టి అవి స్పెషల్ గా మారుతుంటాయి. అందులో కొన్ని అందరిని పిలిచి జరుపుకునేవి ఉంటాయి. కొన్ని గుట్టుచప్పుడు కాకుండా జరుపుకునేవి కూడా ఉంటాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఏది కూడా కోరుకున్నట్లుగా జరగటం లేదు. అలాగని జరుపుకోవడానికి అనుమతి లేదు. తాజాగా ఎన్టీఆర్ గుట్టుచప్పుడు కాకుండా ఆయన చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు తెలుస్తుంది. ఇటీవలే కరోనా నుండి బయటపడిన ఎన్టీఆర్ నుండి ఈ స్పెషల్ న్యూస్ తెలిసేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అలాగే ఈ నెలలోనే ఎన్టీఆర్ దంపతులు తమ 10వ పెళ్లిరోజు కూడా జరుపుకున్నారు. ఈ ఏడాది మే 5తో ఎన్టీఆర్ దంపతుల వివాహ బాంధవ్యానికి పదేళ్లు. కేవలం ఫేవరేట్ హీరోల పుట్టినరోజులకే కాదు ఫేవరేట్ హీరోల పెళ్లిరోజులను కూడా ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. అలాగే వారి పెళ్లి రోజు ట్రెండ్ చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు. 2014లో అభయ్ రామ్ - 2018లో భార్గవ్ రామ్. ఈ ఏడాది జూన్ 14న భార్గవ్ రామ్ నాలుగో యేటలో అడుగుపెట్టనున్నాడు. తాజాగా పంతులుతో అక్షరాభ్యాసం జరిపించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివతో మరో సినిమా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా లైన్ లో పెట్టాడు. ఈ రెండు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.