కొడుకులతో కలిసి డాన్స్ ఇరగదీసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా బిలియనీర్ల ఫంక్షన్ లలో ఆటపాటలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-24 06:24 GMT

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా బిలియనీర్ల ఫంక్షన్ లలో ఆటపాటలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ సొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు ఈవెంట్లలో పాల్గొంటూ.. తమ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక స్టార్ హీరో వెడ్డింగ్ రిసెప్షన్లో భాగంగా ఏకంగా తన ఇద్దరు కొడుకులతో కలిసి డాన్స్ స్టెప్పులతో ఇరగదీసారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొడుకులతో స్టార్ హీరో పెర్ఫార్మెన్స్ అదరహో అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు? ఆ అకేషన్ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. తన నటనతో హిందీ ఆడియన్స్ నే కాకుండా ఇటు సౌత్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్న ఈయన తాజాగా తన కజిన్ ఇషాన్ రోషన్ వెడ్డింగ్ రిసెప్షన్లో సందడి చేశారు. ముఖ్యంగా తన కొడుకులు హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ తో డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశారు. అంతేకాదు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి కొత్త సందడిని తీసుకొచ్చారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించిన ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇషాన్ రోషన్ ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు రాజేశ్ రోషన్ కుమారుడు. అలాగే ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ మేనల్లుడు.. ఇటీవల ఐశ్వర్య సింగ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం వివాహ వేడుకలు ఘనంగా పూర్తయ్యాయి .ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందడి చేశారు. ఇకపోతే మెహందీ వేడుకల్లో తన తల్లి పింకీ రోషన్, మాజీ భార్య సుస్సానే ఖాన్ అలాగే ప్రస్తుత భాగస్వామి అర్స్లాన్ గోని తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు హృతిక్ రోషన్..ఇక్కడే తన ఇద్దరు కొడుకులతో కలిసి సందడి చేశారు.

ప్రముఖ బాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన.. వరుస సినిమాలతో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు

ఇక ఈ ఏడాది ఆగస్టులో వార్ 2 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాలో తొలిసారి ఎన్టీఆర్ నటించి.. తొలిసారి బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కలెక్షన్లను బాగానే వసూలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం క్రిష్ 4 చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు క్రిష్ 4గా రాబోతోంది. రాకేష్ రోషన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు..

హృతిక్ రోషన్ ఇందులో నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. పైగా దర్శకుడిగా అయనకు తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఇక వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.



Tags:    

Similar News