ఇంకెన్నాళ్ళు ఈ దాపరికం.. రహస్య వెకేషన్ కి స్టార్ కపుల్!
టాలీవుడ్ లో ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న రష్మిక - విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ లో ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న రష్మిక - విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించకపోయినా నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ తొలిసారి పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆయనను అక్కడి అధికారులు ఘనంగా ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ చేతి వేలికి ఉన్న ఉంగరం హైలెట్ గా నిలిచింది. తర్వాత కొన్ని రోజులకు రష్మిక కూడా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకోగా.. అందులో ఆమె చేతి వేలికి ఉన్న డైమండ్ రింగు హైలెట్ అయింది. అలా వీరిద్దరూ తమ చేతి ఉంగరాలతో నిశ్చితార్ధాన్ని కన్ఫామ్ చేశారు.
ఇకపోతే పెళ్లికి సంబంధించిన విషయంపై విజయ్ దేవరకొండ ఓపెన్ అవ్వకపోయినా.. రష్మిక మాత్రం ఇటీవల విజయ్ దేవరకొండనే వివాహం చేసుకుంటున్నారని చెప్పి క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ జంట వచ్చే యేడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవ్వగా.. దీనిపై స్పందించిన రష్మిక దీని గురించి ఇప్పుడే మాట్లాడాలని అనుకోవట్లేదు.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే తమ పెళ్లికి సంబంధించిన డేట్ ను రష్మిక స్వయంగా ప్రకటిస్తానని ఇన్ డైరెక్టుగా చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఇన్ని రోజులు కలిసి వెకేషన్స్ కు వెళ్లినా ఎక్కడ కూడా ఫోటోలను, వీడియోలను షేర్ చేయలేదు. కానీ విడివిడిగా వీరు షేర్ చేసిన ఫోటోలు మాత్రం వీరిద్దరూ కలిసి వెళ్లారు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ప్రదేశాలు వీరిద్దరూ కలిసి వెళ్లారు అనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ జంట మరొకసారి వెకేషన్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈసారి కూడా వీరిద్దరూ కలిసి కనిపించకుండా వేరువేరుగా కనిపించారు. కానీ ఎయిర్పోర్టులో కనిపించిన వీరు.. బ్యాక్ గ్రౌండ్ సీన్ మాత్రం ఒకటే అని.. కలిసి వెకేషన్ కి వెళ్తున్నట్టు స్పష్టం చేస్తోంది.అలా మొత్తానికి అయితే వివాహానికి ముందే ఈ జంట కలిసి వెకేషన్ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. చివరికి ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకపోవడంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇంకెన్నాళ్లు ఈ దాపరికం.. ఇప్పటికైనా ఓపెన్ అవ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల విషయానికొస్తే.. వీరిద్దరూ కలిసి తొలిసారి గీతాగోవిందం అనే సినిమాలో నటించారు. అప్పుడే వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని కూడా అందుకుంది. పైగా వీరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించింది.అలా మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారి ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
రష్మిక సినిమా విషయాలకు వస్తే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న ఈమె.. తాజాగా మైసా అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అలాగే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచీ నిన్న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.