• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎనర్జిటిక్ హీరోతో 'గజినీ'...

ఎనర్జిటిక్ హీరోతో 'గజినీ' డైరెక్టర్..?

By - Tupaki Desk
Update: 2021-06-02 14:30 GMT
కోలీవుడ్ దర్శకుడు ఏ.ఆర్‌. మురగదాస్‌ కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. 'గజిని' 'తుపాకి' '7త్ సెన్స్' 'సర్కార్' 'దర్బార్' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మురగదాస్‌.. 'స్టాలిన్' 'స్పైడర్' వంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ 'ఉస్తాద్' రామ్‌ పోతినేని తో ఓ సినిమా చేయనున్నాడని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ రామ్.. తన మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 'రెడ్' చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేశారు. తమిళ్ మీద పట్టున్న రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో చేస్తున్న చిత్రాన్ని కూడా మల్టీ లాంగ్వేజెస్ లో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో మురగదాస్ తో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.

ఇటీవలే రామ్‌ కు మురగదాస్ ఓ స్ర్కిప్ట్‌ వినిపించారని.. దీనికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చిందని అనుకుంటున్నారు. ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ పూర్తైన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే ఇదొక క్రేజీ కాంబినేషన్ అవుతుంది. అంతేకాదు తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రూపొందిస్తారు.

ఇకపోతే లింగుస్వామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమా ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. ఈ ద్విభాషా చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. రాక్‌ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
Tags:    
  • Ram Pothineni 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS