‘గీతాంజలి’ గిరిజ ఇప్పుడేం చేస్తోంది..?
‘గీతాంజలి’ సినిమా చూసిన వాళ్లెవ్వరూ ఆ చిత్ర కథానాయిక గిరిజను అంత సులువుగా మరిచిపోలేరు. ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా మణిరత్నం లాంటి పెద్ద దర్శకుడిగా సినిమాలో టైటిల్ రోల్ చేసే అవకావం దక్కించుకున్న గిరిజ.. తొలి సినిమాతోనే ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. వాళ్ల మనసుల్లో అలాగే నిలిచిపోయింది. ఐతే తలి సినిమాతో అంత గొప్ప పేరు సంపాదించినప్పటికీ.. తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగడానికి ఇష్టపడలేదు. ‘గీతాంజలి’ తర్వాత వచ్చిన ఆఫర్లన్నింటికీ నో చెప్పిన ఆమె.. ‘హృదయాంజలి’ అనే అవార్డు సినిమా ఒకటి చేసి నిష్క్రమించింది. తర్వాత ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు. ఇంతకీ గిరిజ ఇప్పుడెక్కడుందో.. ఏం చేస్తోందో తెలుసుకోవాలన్న ఆసక్తి జనాల్లో ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.
గిరజ పూర్తి పేరు... గిరిజా షెట్టర్. ఆమె పుట్టింది.. పెరిగింది బ్రిటన్ లోని ఆర్సెట్ లో. గిరిజ తండ్రి కన్నడిగుడు. తల్లి ఆంగ్లేయురాలు. చదువైపోయాక భరతనాట్యం నేర్చుకోవడం కోసం ఆమె ఇండియాకు వచ్చింది. ఆ సమయంలోనే అనుకోకుండా మణిరత్నం కళ్లలో పడింది. ‘గీతాంజలి’లో నటించింది. ఐతే తర్వాత గిరిజకు సినిమాల్లో కొనసాగడం ఇష్టం లేకపోయింది. ఆమెకు ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లడంతో పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరింది. తర్వాత ఆమె ‘ఇంటెగ్రల్ యోగా ఫిలాసఫీ- ఇండియన్ స్పిరుచ్యువల్ సైకాలజీ’ అనే అంశంపై 2003లో కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకోవడం విశేషం. ప్రస్తుతం గిరిజ లండన్‌లో జర్నలిస్టుగా పనిచేస్తోంది. రచయిత్రిగా కొన్ని పుస్తకాలు కూడా రాసింది. ఆమె అప్పుడప్పుడూ అరబిందో ఆశ్రమంలో గడిపేందుకు పాండిచ్చేరికి వస్తూ ఉంటుందట. కానీ మీడియాను కలవడానికి అసలేమాత్రం ఇష్టపడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/