విజయ్ దేవరకొండ టార్గెట్ చిన్నదే!

Update: 2018-08-12 07:50 GMT

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఆగష్టు 15 న రిలీజ్ కానుంది.  'అర్జున్ రెడ్డి' సంచలన విజయం తర్వాత విజయ్ సోలో హీరో గా నటించిన సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో - ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.  ఈ సినిమా కలెక్షన్స్ బట్టి విజయ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీపై ఒక అంచనా కు వచ్చే అవకాశం ఉంది.  మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత? టార్గెట్ ఎంత?

'అర్జున్ రెడ్డి' కంటే ముందే ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ 'గీత గోవిందం'.  'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ కొత్తగా సాధించిన ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేయడం - విజయ్ రెమ్యునరేషన్ కూడా పెంచడంతో ముందుగా అనుకున్న దానికంటే సినిమా బడ్జెట్ పెరిగింది.  ఈ సినిమాకు మొత్తం రూ. 14 కోట్లు ఖర్చు అయిందట.  ఈ సినిమా శాటిలైట్ - డిజిటల్ రైట్స్ - ఓవర్సీస్ అన్ని కలిపి 5 కోట్లు రికవర్ అయిందట. ఆ డీల్స్ ఎప్పుడో  క్లోజ్ కావడంతో తక్కువ వచ్చింది కానీ అదే ఇప్పుడైతే  నిర్మాతలకు ఎక్కువ వచ్చి ఉండేదనడంలో సందేహం లేదు.

సో.. మన గోవిందం టార్గెట్ ఇక 9 కోట్లు. రెండు తెలుగు రాష్ట్రాలు - కర్ణాటక కలెక్షన్స్ టార్గెట్ ఇది.  సినిమాకు మంచి బజ్ ఉంది కాబట్టి ఇదేమీ కష్టం కాదు.  థియేట్రికల్ రైట్స్ అమ్మితే ఈజీగానే టేబుల్ ప్రాఫిట్ వస్తుంది కానీ గీతా ఆర్ట్స్ వారు సొంతంగా రిలీజ్ చేస్తున్నారట.  రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
Tags:    

Similar News