• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గని' అవతారంలో బన్నీ...

'గని' అవతారంలో బన్నీ తనయుడి బాక్సింగ్ విన్యాసాలు..!

By - Tupaki Desk
Update: 2021-11-08 12:04 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు మాస్టర్ అల్లు అయాన్ చిచ్చర పిడుగు అనే సంగతి తెలిసిందే. తన సోదరి అల్లు అర్హ తోనూ తండ్రితోనూ అల్లువారబ్బాయి చేసే చిలిపి చేష్టలు.. అల్లరి వీడియోలు అనేకం చూశాం. బన్నీ సతీమణి స్నేహారెడ్డి పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ స్టార్ కిడ్స్ కు చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జూనియర్ బన్నీ ఆల్ రౌండర్ అని అనేక సందర్భాల్లో నిరూపించాడు. అయితే ఇప్పుడు 'గని' సినిమా కోసం బాక్సర్ గా మారిపోయి, తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టాడు అల్లు అయాన్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసిన మేకర్స్.. ఇటీవల 'గని ఆంథెమ్' ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాటకు అల్లు అయాన్ పెరఫార్మన్స్ చేసాడు.

‘గని’ సినిమాలో వరుణ్ తేజ్ మాదిరిగా బాక్సర్ అవతారంలోకి మారిపోయాడు మాస్టర్ అయాన్. బాక్సింగ్ గ్లౌజెస్ ధరించి వర్కవుట్ విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజంగా భారీ వర్కవుట్ చేస్తున్నట్లు ఇంటెన్స్ హావభావాలతో ఆకట్టుకున్నాడు. అల్లు వారసుడు అయాన్ చేసిన వర్కౌట్స్ వీడియోని ను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

'గని' చిత్రానికి అయాన్ తాత అల్లు అరవింద్ సమర్పకులు కాగా.. పెదనాన్న అల్లు బాబీయే నిర్మాత. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మూడో తరం వారసుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో లిటిల్ భరతుడిగా అర్హ కనిపించనుంది. త్వరలో అయాన్ ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆయాన్ సర్ప్రైజింగ్ వీడియోలు చూస్తుంటే వీలైనంత త్వరగా అల్లు వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ప్రోత్సహిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/GeethaArts/status/1457591474229374977?t=esiOToGOp6cGTc2g1Rgjlg&s=19
Tags:    
  • Allu Arjun 
  • Ghani 
  • Allu Ayaan 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS