• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సినిమా కంటే భారీ గా...

సినిమా కంటే భారీ గా సీరియల్ జయ

By - Tupaki Desk
Update: 2018-12-19 01:30 GMT
తమిళనాట అమ్మ గా సుప్రసిద్ధి చెంది ముఖ్యమంత్రి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయలలిత మరణం తర్వాత ఆవిడ బయోపిక్ తీసేందుకు చాలా మంది ప్రయత్నించారు కానీ వెంటనే ఏవీ కార్యరూపం దాల్చలేకపోయాయి. ఇటీవలే నిత్య మీనన్ టైటిల్ రోల్ లో ది ఐరన్ లేడీ అనే పేరుతో ప్రియదర్శని అనే దర్శకుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. సినిమా పక్కా కానీ పోస్టర్ లో ఉన్న లుక్ నిజమా మార్ఫింగా అనేది ఇంకా తేలలేదు.

ఇదిలా ఉండగా ప్రియదర్శిని కంటే ముందు జయ కథను మూవీగా తీయాలని సీనియర్ దర్శకుడు భారతి రాజా కూడా అనుకున్నారు కానీ చివరికి అంత సాహసం చేయలేకపోయారు. కానీ గౌతమ్ మీనన్ మాత్రం మరో రూపంలో జయ చరిత్ర ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చెన్నై మీడియా టాక్. అయితే అది సినిమా రూపంలో కాదు. 30 ఎపిసోడ్ల పాటు సాగే టీవీ సీరియల్ గా రూపొందిస్తారట. టెలికాస్ట్ అయ్యాక ఏదైనా ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులో ఉంచుతారు. దీంట్లో జయగా ఎవరు నటిస్తారు అనేగా మీ అనుమానం.

శివగామి రమ్యకృష్ణ ను ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. భారీగా సినిమా స్థాయికి ఏ మాత్రం తీసిపోని రీతిలో సీనియర్ యాక్టర్స్ ఇందులో నటిస్తారట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీని ప్రసారం ఉండొచ్చని వినికిడి. ది ఐరన్ లేడీ కంటే ముందే ఇది జనంలోకి వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందని వార్త. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తారా లేక నిర్మాత గా ఉంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు
Tags:    
  • Gautham Menon 
  • Jayalalitha 
  • Web Series 
  • telugu News 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS