శాతకర్ణి బిజినెస్.. నితిన్ లక్కీనే

Update: 2016-10-24 09:30 GMT
ఒక క్రేజీ ప్రాజెక్టు మొదలైనపుడు బిజినెస్ ఒకలా ఉంటుంది. సినిమా మధ్యలో ఉండగా మరోలా ఉంటుంది. విడుదలకు ముందు రేట్లు మరోలా ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు మొదలైనపుడు ఎంత త్వరగా ఒప్పందాలు చేసేసుకుంటే అంత మంచిది. ముందు అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసేసుకుంటే.. ఆ తర్వాత మారు బేరానికి అమ్మకాలు చేసుకోవడానికి కూడా వీలుంటుంది. హీరో నితిన్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో ఏం ఆలోచించాడో ఏమో కానీ.. మిగతా బయ్యర్ల కంటే చాలా ముందుగా స్పందించాడు. నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసేసుకున్నాడు. అప్పుడు అతను రూ.11.25 కోట్లకే హక్కుల్ని సొంతం చేసుకున్నాడు.

ఐతే ప్రస్తుతం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే నితిన్ చాలా లక్కీ అంటున్నారంతా. చాలా తక్కువ మొత్తానికే హక్కులు పట్టేశాడని చాలామంది అతణ్ని చూసి కుళ్లుకుంటున్నారు. ఎందుకంటే సీడెడ్ ఏరియా వరకే రూ.9 కోట్లు పలికింది ‘శాతకర్ణి’. మామూలుగా నైజాం ఏరియాలో 60 శాతం రేటు పలుకుతుంటుంది సీడెడ్లో ఏ పెద్ద సినిమాకైనా. ఇక మిగతా ఏరియాల్లోనూ ‘శాతకర్ణి’ రేట్లు భారీగానే ఉన్నాయి. ఒక్క గుంటూరు జిల్లాకే రూ.4.5 కోట్లు పెట్టారు. అలాంటిది నైజాం హక్కులు రూ.11.25 కోట్లు మాత్రమే అంటే ఆశ్చర్యమే. ఇప్పుడున్న హైప్ ప్రకారం అయితే ఆ సినిమాకు ఇక్కడ రూ.14-15 కోట్ల వరకు రేటు రావాలి. ఐతే ముందు వచ్చాడు కాబట్టి నితిన్‌ ఆ మేరకు బంపర్ ఆఫర్ అందుకున్నట్లున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News